YSRCP Focus on YS Viveka Murder Case: ఎన్నికలు (AP Elections 2024) సమీపిస్తున్న వేళ వివేకా కేసు (YS Viveka Murder Case) విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్న జగన్ సర్కారు (YSRCP Govt) బాధితులను అణగదొక్కే పనిలో నిమగ్నమైంది. బాధితులపైనే కేసులు పెట్టి వేధించడమే కాక కేసులో కీలక సాక్షిగా మారిన అప్రూవర్ దస్తగిరి (Viveka Murder Case Approver Dastagiri)ని జైలు నుంచి బయటికి రాకుండా కుట్రలు పన్నుతోంది.
వివేకా కుమార్తె సునీత (Viveka Daughter Sunita) దంపతులపైనా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య గురువారం ఒకే సమయంలో వివేకా కుమార్తె, అల్లుడు కడప ఎస్పీ (Kadapa SP)ని కలవడం, మరోవైపు దస్తగిరి భార్య షబానా (Dastagiri Wife Shabana) సీఎం జగన్ (CM Jagan), అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy)పై తీవ్ర ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివేకా కేసు - సీబీఐ ఎస్పీ రామ్సింగ్తో సహా వైఎస్ సునీతపై పోలీసుల ఛార్జిషీట్
సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీకి వివేకా కుటుంబం నుంచి ఎవరో ఒకరు బరిలో ఉండాలని షర్మిల (APCC Chief YS Sharmila), సునీత మధ్య గత నెల ఇడుపులపాయ వేదికగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో సునీతపై కేసులు పెట్టడం, సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నాయకుల పేర్లతో అసభ్యకరమైన పోస్టులు (Obscene Posts on YS Sharmila and Sunitha on Social Media) పెట్టడం వంటివి జరిగాయి. సునీత కుటుంబాన్ని మానసికంగా దెబ్బ కొట్టాలనే ఎత్తుగడతో వైసీపీ పెద్దలు ఇలాంటి కుట్రలకు తెరలేపారనే చర్చ జోరుగా సాగుతోంది.
ఈ సమయంలో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి గురువారం కడప ఎస్పీ సిద్ధార్థకౌశల్ (Kadapa SP Siddharth Kaushal)ను కలిసి గంట పాటు మాట్లాడటంతో పాటు అనేక అంశాలపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రధానంగా వివేకా హత్య జరిగిన రోజున పీఏ కృష్ణారెడ్డి (Viveka PA Krishna Reddy) ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు (Pulivendula Police) హత్య కేసు (Murder Case) నమోదు చేశారు.
'నా భర్తను బెయిలుపై విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు'
సీబీఐ (CBI) కేసు దర్యాప్తు చేపట్టిన తర్వాత సునీత వెంట నడిచిన కృష్ణారెడ్డి రెండేళ్ల నుంచి హఠాత్తుగా వైసీపీ పెద్దల కనుసన్నల్లో తిరుగుతున్నారు. సునీత, రాజశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా పులివెందుల కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సునీత దంపతులతో పాటు సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పైనా పోలీసులు కేసులు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. తమపై ఎందుకు కేసులు నమోదు చేయాల్సి వచ్చిందో దాని వెనకున్న కుట్ర, దారితీసిన పరిస్థితులను పూసగుచ్చినట్లు సునీత దంపతులు జిల్లా ఎస్పీకి వివరించినట్లు సమాచారం.
వివేకా కేసును నీరు గార్చి ఎన్నికల సమయంలో తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి కుయుక్తులు చేస్తున్నారని సునీత తెలిపినట్లు తెలిసింది. సునీతతో పాటు షర్మిలపై సామాజికమాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన పులివెందులకు చెందిన వైసీపీ నేత వర్రా రవీంద్రారెడ్డి చరిత్ర, గతంలో ఎలాంటి నేరాలు చేశారనే విషయాలతో పాటు ఎంపీ అవినాష్‌రెడ్డికి అనుచరుడిగా ఉంటాడనే విషయాలను ఎస్పీకి తెలిపినట్లు సమాచారం. తమకు భద్రత కల్పించే అంశంపైనా ఎస్పీతో సునీత దంపతులు చర్చించినట్లు సమాచారం.
వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీని కలిసిన వైఎస్ వివేకా కుమార్తె
గురువారం ఎస్పీ (SP)ని సునీత దంపతులు కలిసిన సమయంలోనే వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి భార్య షబానా కడప జైల్లో భర్తను కలిశారు. వేముల కేసులో అరెస్టైన దస్తగిరికి రెండు రోజుల కిందట కడపజిల్లా కోర్టు బెయిలు మంజూరు చేస్తే విడుదల కాకముందే ఏ-3 నుంచి ఏ-1గా మారినట్లు పత్రాలు తారుమారు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కావాలనే తన భర్తను విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దస్తగిరిని ఇటీవల కొందరు వైసీపీ నేతలు జైలులో కలిసి రాజీ ప్రయత్నాలు చేశారని చెప్పారు. భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపుతూ కోర్టులో అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెచ్చినట్లు దస్తగిరి తెలిపారని వివరించారు. తన భర్త అందుకు అంగీకరించ పోవడంతో బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదల కాకుండా ఇబ్బంది పెడుతున్నారని దస్తగిరి భార్య వాపోయారు.
దస్తగిరికి బెయిలు (Dastagiri Bail) మంజూరైనా బయటకు రాకుండా పోలీసులు సాంకేతిక పరమైన అంశాలను చూపించడంతో మరోసారి కోర్టులో పత్రాలను న్యాయమూర్తి పరిశీలించే అవకాశం ఉంది. పోలీసులు నిజంగా పత్రాలు తారుమారు చేశారా అనే అంశంపైనా జిల్లా ఎస్పీ ఆరా తీసినట్లు సమాచారం.