YS Sharmila Fires On YS Jagan : అభివృద్ధి లేకుండా రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగనేనని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశం అయ్యారు. తిరుపతిలో "ఇండియా టుడే (India Today)" విద్యాసదస్సులో పాల్గొన్న జగన్ ఏపీని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని జగన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై తనదైన పద్దతిలో కాస్తా ఘాటాగానే స్పందిచారు.
జగనన్న గెలుపుకు ప్రచారం చేశా : వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం చేజేతులా జగనన్న చేసుకున్నదే అని షర్మిల అన్నారు. అందుకు సాక్ష్యం దేవుడు, తన తల్లి విజయమ్మ అని అన్నారు. వైఎస్సార్సీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. పార్టీ కోసం నెలల తరబడి 3,200కి.మీ పాదయాత్ర చేశానని, తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టానని, సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించానని తెలిపారు. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపు కోసం అండగా నిలబడి ప్రచారం చేశాని షర్మిల గుర్తు చేశారు.
బీజేపీ చేతుల్లో వైసీపీ - ప్రత్యేక హోదా మర్చిపోయిన జగన్: షర్మిల
రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను గాలికి వదిలేశారు : జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన రోజు నుంచి పూర్తిగా మారిపోయారుని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా ఫర్వాలేదు అనుకున్నానని అన్నారు. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి పేరు, ఆయన ఆశయాలు నిలబెడితే చాలు అనుకున్నానని అన్నారు. కానీ ఆయన మాత్రం రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగ : వైఎస్ ఆశయాలు నిలబెడతారని జగన్‌ను ప్రజలు సీఎం చేశారని, వైఎస్ వారసులమని చెప్పడం కాదు పని తీరులో కనపడాలని గుర్తు చేశారు. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయం ఒక పండుగ అయితే జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగగా మారిందని ఆరోరించారు. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలన్న ధ్యాస లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ షర్మిల వాహన కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు - రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు
పోలవరంపై సమాధానం చెప్పాల్సిందే : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్టు పోలవరమని షర్మిల తెలిపారు. 1941లో దాన్ని నిర్మించాలనుకుంటే ఏ నాయకుడూ సాహసం చేయలేదని, వైఎస్ సీఎం అయిన 6 నెలల్లోనే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి రాజధాని ఉందా లేదా? : ప్రత్యేక హోదా కోసం ఏనాడూ జగనన్న ఉద్యమం చేసింది లేదని, కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడిందీ లేదని ఒక రాజధాని కాదు 3 రాజధానులన్న జగన్, ఇవాళ అసలు రాజధాని ఉందా లేదా అనే అనుమానం కలిగే విధంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. ఆఖరికి విశాఖ స్టీల్‌ను కూడా బీజేపీకి జగన్ పణంగా పెట్టారని, స్టీల్‌ప్లాంట్‌కు భూములిచ్చిన వారు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారని షర్మిల అన్నారు.
బీజేపీ బానిస వైఎస్సార్సీపీ : జగన్‌తో పాటు ఆ పార్టీ వారంతా బీజేపీకి బానిసలుగా మారారని షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకున్నా ఆ పార్టీ రాజ్యమేలుతోందని అన్నారు. వైఎస్సార్సీపీనే కాదు, రాష్ట్రాన్ని కూడా బీజేపీకి బానిసగా చేశారని నిప్పులు చెరిగారు.