MLA Rachamallu Sivaprasad Reddy: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏ పని చేసినా సంచలనంగా మారుతోంది. ఎన్నికల కొడ్ ప్రారంభానికి ముందు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం, బంగారం దుకాణాల్లో తనిఖీలు చేస్తే స్పందిస్తూ తీవ్రవ్యాఖ్యలు చేయడం, ఎన్నికల ప్రచారంలో మహిళా కౌన్సిలర్ ను బెదిరించడం, ఎన్నికల నిబంధనలు అతిక్రమించడం, ఇలా ఎమ్మెల్యే ఏం చేసిన కాంట్రవర్సీగా మారుతోంది. తాజాగా ఎమ్మెల్యేకు కడప జిల్లా సర్పంచ్ల సంఘం నేతకు మధ్య నెలకొన్న వైరం విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యే తన వర్గానికి చెందిన వ్యక్తులను డబ్బులతో కొనాలని చూస్తున్నారంటూ వైఎస్ఆర్ కడప జిల్లా సర్పంచ్ల సంఘం నేత ఆరోపించారు.
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అన్నమాదిరిగా తయారైంది. ఇరువురి నేతల వ్యక్తిగత పోరుతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సహకరించేది లేదని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. తాను రాచమల్లు ఓటమి కోసం మాత్రమే పనిచేస్తానన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని వార్డు మెంబర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. ఒక్కో వార్డు మెంబర్‌కు 50 లక్షరూపాయలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. తనవైపు ఉన్న నేతలను ఇంటికి పిలిపించుకొని భేరాలు ఆడారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే 200 కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. రాచమల్లు తమను అనేక ఇబ్బందులకు గురుచేశాడని వాపోయాడు. రాచమల్లు అభ్యర్థిత్వంపై సీఎం జగన్ పునరాలోచించుకుకోవాలని సూచించారు.
'నేనే వస్తా - మీ అంతు తేలుస్తా' - మహిళా కౌన్సిలర్‌కు ఎమ్మెల్యే రాచమల్లు బెదిరింపులు
తాను సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి బాటలోనే నడుస్తానని కొత్తపల్లి ఎంపీటీసీ సౌభాగ్యమ్మ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు తన వర్గంలో చేరాలంటూ ప్రలోభాలకు సౌభాగ్యమ్మ ఆరోపించారు. తాను ఎమ్మెల్యే వద్ద రూ. 12 లక్షలు తీసుకున్నానని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాచమ్లలు కోటి రూపాయలు ఇచ్చానా, అతని వర్గంలో చేరబోమని స్పష్టం చేశారు. కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అతని వెంటే నడుస్తామని సౌభాగ్యమ్మ పేర్కొన్నారు. శివచంద్రారెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే, తామంతా ఆపార్టీకి వెళ్తామని సౌభాగ్యమ్మ వెల్లడించారు.
అనుమతి లేకుండా రాచమల్లు ప్రచారం - అడ్డుకున్న అధికారులు
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై ఇప్పటికే పోలీస్ కేసు నమోదైంది. వైసీపీకి చెందిన మహిళా కౌన్సిలర్ ను బెదిరించిన ఘటనలో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి రాలేదనే కోపంతో, మహిళా కౌన్సిలర్ వెంకట లక్ష్మీ ఇంటికెళ్లి బెదిరించినట్లు ఫిర్యాదు చేసింది. తన భర్త రామాంజనేయులు కాళ్లు విరిచేస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినట్లు వాపోయింది.
ఎమ్మెల్యే రాచమల్లుకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించం: అసమ్మతి నేతలు - Meeting Against MLA Rachamallu