ETV Bharat / politics

వైఎస్సార్సీపీకి వరుస షాక్​లు - టీడీపీలో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ - West Godavari YCP Leaders Join TDP - WEST GODAVARI YCP LEADERS JOIN TDP

West Godavari YSRCP Leaders Join TDP : పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీకీ భారీ షాక్ తగిలింది. జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీతో పాటు మరో ఆరుగురు వైఎస్సార్సీసీపీ నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ మంత్రి లోకేశ్‌ కండవా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిషారానికి కృషి చేయాలని లోకేష్‌ ఆకాంక్షించారు.

West Godavari YSRCP Leaders Join TDP
West Godavari YSRCP Leaders Join TDP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 12:38 PM IST

West Godavari YSRCP Leaders Join TDP : పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీకీ భారీ షాక్ తగిలింది. జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీతో పాటు మరో ఆరుగురు వైఎస్సార్సీసీపీ నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరాంజనేయులు నేతృత్వంలో వీరికి మంత్రి లోకేశ్‌ కండవా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిషారానికి కృషి చేయాలని లోకేశ్​ ఆకాంక్షించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పలువురు వైఎస్సార్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ఘంటా ప్రసాదరావు తెలుగుదేశం పార్టీలో చేరడంతో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేశ్ జడ్పీ చైర్ పర్సన్ దంపతులను టీడీపీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారధ్యంలో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని జడ్పీ చైర్ పర్సన్ దంపతులు పేర్కొన్నారు.

రాజీనామా పత్రాలు రెడీ! - బైబై జగన్ అంటున్న వైఎస్సార్సీపీ ఎంపీలు - ysrcp rajya sabha MPs

మంత్రి లోకేశ్ సమక్షంలో జడ్పీ చైర్ పర్సన్ దంపతులతో పాటు వైఎస్సార్సీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ. అశోక్, ఎస్. కిషోర్, ఎస్. మురళీ, రెడ్డి కిషోర్​లు సైకిల్ ఎక్కారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి నారా లోకేశ్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఇప్పటికే జిల్లాలో ప్రధాన నాయకులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఇదే కోవలో జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉండటంలో జిల్లాలో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

'వైఎస్సార్సీపీలో కొనసాగలేను' - జగన్​కు చెప్పిన బాలినేని - జనసేన వైపు అడుగులు! - Balineni Srinivasa Reddy to Resign

చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు - నేడు కేబినెట్ ముందుకు దస్త్రం - 33 Percent BC Reservation in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.