ETV Bharat / politics

వైఎస్​ వారసులు ఎవరు? - తేల్చేసిన విజయమ్మ - Vijayamma Support Sharmila

VIJAYAMMA SUPPORT SHARMILA : వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి రాజకీయ వారసులెవరో ఆయన సతీమణి విజయమ్మ తేల్చేశారు. వైఎస్​ ముద్దుబిడ్డ షర్మిలను గెలిపించాలని ఆమె కోరారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని విజయమ్మ విడుదల చేశారు.

ys_vijayamma_support_sharmila
ys_vijayamma_support_sharmila (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 4:17 PM IST

VIJAYAMMA SUPPORT SHARMILA : వైఎస్సార్సీపీ అధినేత జగన్​, కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల... వీరిద్దరిలో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి రాజకీయ వారసులు ఎవరు? వైఎస్ మరణాంతరం ఇద్దరూ ఒకేసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్​తో విభేదించి జగన్​ కొత్త పార్టీ పెట్టినా ఎన్నికల ప్రచారంలో షర్మిల పాత్ర అంతా ఇంతా కాదు. అన్నాచెల్లెళ్లిద్దరూ తమదైన శైలిలో ప్రసంగించి ప్రజలను ఆకట్టుకున్నారు. 'జగనన్న విడిచిన బాణాన్ని' అంటూ షర్మిల చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తే. అదే విధంగా 'నా అక్క చెల్లెమ్మలు' అంటూ ప్రసంగించే జగన్​కు వ్యతిరేకంగా స్వయంగా ఆయన చెల్లెళ్లు షర్మిల, సునీత మాట్లాడడం తాజా రాజకీయాల్లో పెను చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే వైఎస్ రాజశేఖర్​ రెడ్డి రాజకీయ వారసులు ఎవరు అనే అంశంలో స్వయంగా ఆయన సతీమణి విజయమ్మ స్పష్టత నిచ్చారు. రాజశేఖర్​ రెడ్డి అభిమానులు ఎవరిని గెలిపించాలో కూడా చెప్తూ వారసురాలిని తేల్చేశారు.

చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించిన అన్నగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు: షర్మిల - YS Sharmila Allegations on Jagan

ఓ వైపు కుమారుడు, మరో వైపు కుమార్తె. అన్నాచెల్లెళ్ల రాజకీయ పోరు, పరస్పర విమర్శల జోలికి వెళ్లకుండా విజయమ్మ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా అమెరికాలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వద్ద ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, తాజాగా ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వైఎస్ ముద్దు బిడ్డ ఎవరో, వైఎస్​ అభిమానులు ఎవరికి ఓటు వేసి గెలిపించాలో తేల్చిచెప్పారు. కడప ఓటర్లు షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరడం రాజకీయ వారసత్వాన్ని ప్రకటించినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ విజయమ్మ ఏమన్నారంటే!

గొడ్డలితో అందర్నీ నరికేయండి, అప్పుడు మీరే సింగిల్​ ప్లేయర్​- భారతిపై వైఎస్ షర్మిల ఆగ్రహం - YS Sharmila Comments on Avinash

"రాజశేఖర్​రెడ్డి గారిని అభిమానించే వారికి, రాజశేఖర్​ రెడ్డి గారిని ప్రేమించే వారికి, యావత్​ కడప లోక్​సభ నియోజకవర్గ ప్రజలందరకీ నా విన్నపం. రాజశేఖర్​ రెడ్డి గారిని ఏ విధంగా అభిమానించారో!, ఏ విధంగా అక్కున చేర్చుకున్నారో!, ఏ విధంగా నిలబెట్టుకున్నారో ఆయన కూడా ఆయన ఊపిరున్నంత వరకు ప్రజా సేవకే అంకితమయ్యారు. ప్రజా సేవ చేస్తూనే ఆయన చనిపోయారు. ఈ రోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీ చేస్తాఉంది. ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్​కు పంపమని, తండ్రిలాగే సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వమని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. - వైఎస్ విజయమ్మ

వైఎస్​ వారసులు ఎవరు? - తేల్చేసిన విజయమ్మ (ETV Bharat)

'ఒక వైపు వైఎస్సార్ బిడ్డ - మరో వైపు వివేకా హత్య నిందితుడు - ఏవరికి ఓటు వేస్తారు?' - YS SHARMILA ELECTION speech

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.