Varun Tej Election Campaign in AP: ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందులొ భాగంగా అభ్యర్థులే కాకుండా వారి కుటుంబ సభ్యలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థుల తరపున ఓటు వేయాలంటూ ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పవన్ తరుఫున ఇప్పటికే పలువురు సినీ తారాలు, బుల్లితెర నటులు హైపర్ ఆది, గెటప్ సీను, డ్యాన్స్ మాస్టర్ తదితరులు ప్రచారంలో పవన్‌కు మద్దతుగా విస్తృతంగా పాల్గొంటున్నారు. తాజాగా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పవన్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌కు మద్దతుగా, జనసేన హీరో వరుణ్ తేజ్ ప్రచారంలో పాల్గొన్నారు. పవన్‌కు విజయాలు లేకున్నా.. ప్రజలకు మేలు చేస్తున్నారని వరుణ్ తెలిపారు. పవన్ అప్పులు చేసి కౌలురైతులకు సాయం చేస్తున్నారని గుర్తుచేశారు. పవన్‌ను పిఠాపురం నుంచి గెలిపిస్తే మరింత సేవచేస్తారని హీరో వరుణ్ తేజ్ వెల్లడించారు. ప్రజలే పవన్‌కల్యాణ్‌కు కుటుంబసభ్యులని, పవన్ ప్రజల కోసం పని చేసే మనిషి అని వెల్లడించారు. పవన్‌పై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణపై స్పందిస్తూ, నిజాయితీ ముందు అవేవి నిలబడవని అన్నారు. ఒకవైపు సినిమా షూటింగ్‌లు చేస్తూనే బాబాయికి తరుఫున ప్రచారంలో పాల్గొంటామని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని వరుణ్ తేజ్ పిలుపునిచ్చారు.
ట్రైబల్ యూనివర్సిటీకి దిక్కులేదు - మెడికల్ కాలేజీ పెట్టలేదు: వైఎస్ షర్మిల - SHARMILA fire on JAGAN
కాకినాడ జిల్లా పిఠాపురంపిఠాపురం చేరుకున్న హీరో వరుణ్ తేజ్‌కు జనసేన, బీజేపీ, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో పాల్గొనడాకి ముందు పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన వరుణ్.. మా అందరికీ పవన్ కల్యాణ్ ఆదర్శమని పేర్కొన్నారు. పవన్ డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేయడానికి వచ్చాడని తెలిపారు. పైగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాతే తాను సంపాదించుకున్నది పోగొట్టుకుంటున్నాడని వెల్లడించారు. పవన్‌కు మద్దతుగా గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చెందుర్తి గ్రామాలలో బైకు ర్యాలీతో పాటుగా రోడ్డు షోల్లో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. సాయంత్రం దుర్గాడలో భహిరంగ సభలో మాట్లాడారు.