Nara Lokesh Assurance for Handloom Workers : ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరికి చెందిన తటస్థ ప్రముఖులతో నారా లోకేశ్ గురువారం భేటీ అయ్యారు. మంగళగిరి 4వ వార్డులో నివసిస్తున్న జంజనం మల్లేశ్వరరావు నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. వారి కుటుంబసభ్యులు యువనేతకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలతోపాటు చేనేతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను లోకేశ్ దృష్టికి తెచ్చారు. గత ఏడాది అక్టోబర్ 5న నిర్మాణంలో ఉన్న తమ భవనాన్ని ఎమ్మెల్యే ఆర్కే ప్రోద్భలంతో అధికారులు కూల్చివేశారని ఆవేదన చెందారు. తమ ప్రాంత వాసులంతా దశాబ్దాలుగా ఎండోమెంట్స్ భూముల్లో నివాసం ఉంటున్నామని తెలిపారు.
ఇళ్ల నిర్మాణాలను ఆపేయాలని ఎండోమెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారని, వెంటనే తాము హైకోర్టుకు వెళ్లగా స్టే వచ్చిందని వివరించారు. కానీ, స్టే కాపీని తెచ్చేలోపు అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారని వాపోయారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ జగన్, ఆయన సామంతరాజులకు తెలిసింది కూల్చివేతలు మాత్రమేనన్నారు. అధికారంలోకి వచ్చాక ఎండోమెంట్స్ వారికి ప్రత్యామ్నాయ భూమి చూపించి, దీర్ఘకాలంగా నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలిచ్చేలా తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేతల ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
యువగళం పాదయాత్రకు అక్షరరూపం- "శకారంభం" పేరుతో పుస్తకం - Lokesh Launch Sakarambham Book
చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామని, ముడిసరుకు సబ్సిడీతోపాటు చేనేత వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు. అనంతరం 14వ వార్డుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాండ్రు శ్రీనివాసరావు నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని లోకేశ్ ప్రారంభించారు. మంగళగిరి చేనేతలపై తమకు ప్రత్యేకమైన ప్రేమ ఉందని, వారికి ఏ కష్టమొచ్చినా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు. మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి మంచి మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని లోకేశ్ కోరారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్డీయే తరఫున తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు పీలమేడులో జరిగే బీజేపీ సభలో లోకేశ్ పాల్గొని అక్కడి తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా లోకేశ్ ప్రచారం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన నేపథ్యంలో లోకేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించకుంది. రేపు సింగనల్లూరులో తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేశ్ సమావేశమై అన్నామలై విజయానికి సహకరించాలని కోరనున్నారు.