ETV Bharat / politics

'ఈ పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నా' - అధిష్ఠానం పెద్దలకు ఎమ్మెల్సీ లేఖ

తాజా రాజ‌కీయ పరిణామాల‌పై కాంగ్రెస్ అగ్రనేత‌ల‌కు లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి - పార్టీ ఫిరాయింపులపై తీవ్ర అసహనం

telangana-mlc-jeevan-reddy-sensational-letter
telangana-mlc-jeevan-reddy-sensational-letter (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Telangana MLC Jeevan Reddy Sensational Letter : తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజ‌కీయ పరిణామాల‌పై కాంగ్రెస్ అగ్రనేత‌ల‌కు ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి లేఖ రాశారు. త‌న అనుచ‌రుడు గంగారెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌పై తీవ్ర ఆవేద‌న‌తో స్పందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక‌ల‌తోపాటు మొత్తం 8 మందికి మూడు పేజీల‌ లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపుల‌పై తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక పోతున్నాన‌ని, తీవ్ర మానసిక బాధతో లేఖ రాసిన‌ట్లు వెల్లడించారు. ఈ లేఖ రాయాల్సి రావ‌డంపై తాను విచారిస్తున్నాన‌న్నారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా బీఆర్​ఎస్ నుంచి కొంద‌రు కాంగ్రెస్‌లోకి రావ‌డం వ‌ల్ల క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యక‌ర్తలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నట్లు ఆందోళ‌న వ్యక్తం చేశారు. 65 మంది ఎమ్మెల్యేల‌తో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సుస్థిర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. కొంద‌రు స్వార్ధ ప‌రులు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్పడుతున్నార‌ని ఆరోపించిన జీవ‌న్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి పిరాయింపుల‌కు ముఠా నాయ‌కుడిగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ఉద్దండరాయునిపాలెం వైపు దూసుకెళ్లిన CRDA జేసీబీలు - అక్రమ కట్టడాల కూల్చివేత

కాంగ్రెస్ పార్టీ బి ఫారంతో గెలిచిన వాళ్ల మాదిరి బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ని ధ్వజ‌మెత్తారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు లేకుంటే ప్రభుత్వం నడవదా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుదారులు కాంగ్రెస్ ముసుగు వేసుకోవడం త‌న‌కు బాధ కలిగిస్తోందని ఆందోళ‌న వ్యక్తం చేశారు. ఆధిపత్య పోరు కోసం గంగిరెడ్డిని క్రూరంగా హత్య చేశార‌న్న జీవ‌న్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సంజ‌య్ పాత్ర ఉంద‌ని తాను ఎక్కడ మాట్లాడ‌లేద‌ని స్పష్టం చేశారు.

హ‌త్యకు పాల్పడిన బ‌త్తిన సంతోష్ బ‌ల‌మైన బీఆర్​ఎస్ (BRS) కార్యక‌ర్తగా మాత్రమే చెప్పాన‌ని వివ‌రించారు. నిందితుడు సంతోష్‌పై అనేక కేసులు ఉన్నాయ‌ని ఆరోపించిన జీవ‌న్ రెడ్డి ఎవ‌రి అంద‌డండ‌లు చూసుకుని గంగారెడ్డిని హ‌త్య చేశార‌ని ప్రశ్నించారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ల‌ను కలిసి త‌న ఆవేద‌న‌ను చెప్పుతాన‌ని తెలిపారు. పార్టీ విధానానికి అనుగుణంగానే త‌న‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు జీవ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన గడ్కరీ - 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణానికి నిధులు మంజూరు

"నన్ను ఎవరూ ఏం చేయలేరు!" 20 ఎకరాలు ఆక్రమించేశాడు - దారిని కూడా దున్నేశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.