TDP Varla Ramaiah on AP Final Voter List: రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితాలో అక్రమాలు ఉన్నాయని, ఎన్నికల అధికారులు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారని టీడీపీ వర్ల రామయ్య ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దొడ్డిదారిన ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నియోజకవర్గాలు మార్చిన మంత్రులు పాత నియోజకవర్గాల్లో ఓటర్లను వచ్చేయాలని పిలుపు ఇస్తున్నారని, ఇదేం విచిత్రమని నిలదీశారు.
విడదల రజినీ, వెలంపల్లి, మేరుగ నాగార్జున తదితరులు పెద్ద సంఖ్యలో ఫారం-6 అప్లికేషన్లు దాఖలు చేశారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారని విమర్శించారు. ఒక ఇంట్లో 1,500 ఓట్లు ఉన్న పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రధానాధికారి రాజకీయ పార్టీలకు ఇచ్చిన తుది ఓటర్ల జాబితాలో యువ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉందని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు.
4 కోట్లపై చిలుకు ఓటర్లు ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారన్నారు. జిల్లాలతో పాటు నియోజకవర్గాల స్థాయిలో జాబితాలనూ ఇవ్వాలని కోరామని చెప్పారు. ఎన్నికల జాబితాలో అక్రమాలకు పాల్పడిన కలెక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరామన్న ఆయన ఒక్క అన్నమయ్య కలెక్టర్ గిరీశాను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీ ఆగ్రహం - పోలీస్ అధికారులపైనా చర్యలకు సమాయత్తం!
కాగా భారీగా దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలతో భేటీ అయిన సీఈఓ ఎంకే మీనా 2024 ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు.
తెలుగుదేశం తరఫున వర్ల రామయ్య, వైసీపీ తరపున ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, సీపీఎం, సీపీఐ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. 2024 తుది ఓటర్ జాబితాను రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అందించారు. రాష్ట్రంలో మెుత్తం ఓటర్లు 4కోట్ల 8లక్షల 7వేల 256 మంది ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య 2కోట్ల 7లక్షల 37వేల 65, పురుష ఓటర్ల సంఖ్య 2కోట్ల 9వేల 275గా ఉంది. సర్వీస్ ఓటర్లు 67వేల 434, థర్డ్ జెండర్ ఓటర్లు 3వేల 482 మంది ఉన్నారు.
ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో సుమారు 6 లక్షల మేర ఓటర్ల సంఖ్య పెరిగింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 20లక్షల 16వేల 396 మంది ఓటర్లు ఉండగా అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 7లక్షల 61వేల 538 మంది ఓటర్లు ఉన్నారు. "C.E.O. డాట్ ఆంధ్రా" వెబ్ సైట్లో జిల్లాల వారీగా తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం పొందుపరిచింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించింది.
ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులు - ప్రక్రియ ప్రారంభించిన ఈసీ
5.64 లక్షల ఓటర్లు ఔట్ - అనర్హులను ఏరివేసిన ఈసీ 'టీడీపీ ఫిర్యాదుకు స్పందన'