ETV Bharat / politics

పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థులు ఖరారు - ఇద్దరి పేర్లు ప్రకటించిన అధిష్ఠానం

ఏపీలో రెండు పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

tdp_mlc_candidate
tdp_mlc_candidate (ETV Bharat)

TDP MLC CANDIDATES: ఆంధ్రప్రదేశ్​లో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. కృష్ణా-గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్​లని చంద్రబాబు ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ప్రకటన విడుదల చేశారు.

Alapati raja
Alapati raja (ETV Bharat)
పేరాబత్తుల రాజశేఖర్​
పేరాబత్తుల రాజశేఖర్​ (ETV Bharat)

వ్యూహంపై దిశానిర్దేశం: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎన్డీఏ శ్రేణులు సమావేశం అయ్యారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ప్రకటించిన కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించేలా కూటమి శ్రేణులు కృషి చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తునిలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన, యువతకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తదితర అంశాలపై శ్రేణులకు మార్గ నిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇస్తామన్నారు. అరాచకాలు, అక్రమాలకు పాల్పడితే మాత్రం ఉపేక్షించబోమని యనమల అన్నారు.

మళ్లీ ఏపీలో ఎన్నికల సందడి - ఓటర్లుగా పేర్లు ఇలా రిజిస్టర్ చేసుకోండి

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.