Unemployed Fire on YSRCP Government : 2018లో గ్రూప్-1 ఉద్యోగాలను ముఖ్యమంత్రి జగన్ 150 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను మూడు సార్లు మూల్యంకనం చేయడం వెనక పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకే మూడు సార్లు మూల్యాంకనం చేయించారన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తప్పును గుర్తించినట్లు చెప్పారు. అందుకే మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చిందన్నారు. యువత భవిష్యత్‌ను నాశనం చేసిన ఎవ్వరినీ వదిలేది లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కుంభకోణంపై విచారణ జరిపిస్తామని తేల్చిచెప్పారు.
రాజకీయ పునరావాస కేంద్రంలా ఏపీపీఎస్సీ- గ్రూప్1 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అక్రమ మార్గంలో ఉద్యోగం పొందిన 162 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని హర్షిస్తున్నామని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిఖ్ పేర్కొన్నారు. గ్రూప్ 1 లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కడప జడ్పీ కూడలిలో ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో సిద్ధిఖ్ మాట్లాడారు. 2018 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. కానీ, 2020 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అక్రమ మార్గంలో 162 మంది ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. వారందరినీ ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గ్రూప్ వన్ లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కడప జడ్పీ కూడలిలో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం (YSRCP Govt) ఉద్యోగాలను కోట్ల రూపాయలకు అమ్ముకుందని విమర్శించారు.
ఆరు నెలల్లో మళ్లీ గ్రూప్-1 మెయిన్స్ - మూల్యాంకనం నిష్పాక్షికంగా జరగలేదన్న హైకోర్టు
వైసీపీ ప్రభుత్వం కేవలం మాఫియా ప్రభుత్వమే కాదని చివరకు ఉద్యోగాలను సైతం అమ్ముకున్నదని ధ్వజమెత్తారు. ఏపీపీఎస్సీ బోర్డు (APPSC Board) పూర్తిగా రాజకీయ రంగు పులుముకుందని విమర్శించారు. అర్హత ఉన్నవాళ్లకు మొండి చేయి చూపించి అనర్హులకు గ్రూపు 1 ఉద్యోగాలు ఇవ్వడం దుర్మార్గమని ఖండించారు. దీని వెనకాల ఉన్న ఏపీపీఎస్సీ అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులపై తక్షణం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐచేత విచారణ జరిపించాలని కోరారు. కోర్టు మంచి నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు.
ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్
గ్రూప్-1 పోస్టులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మేశారంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తిరుపతి భవానినగర్ కూడలిలో బైఠాయించి నిరుద్యోగులు, విద్యార్థులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ కమిషన్ (APPSC Commission) కాస్త వైఎస్ఆర్‍సీపీ కలెక్షన్ కమీషన్ గా మారిందని ఆరోపించారు. గౌతమ్ సవాంగ్, సీతా రామాంజనేయులపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి సార్వత్రిక ఎన్నికల్లో జనం బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రేపు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు వెల్లడించారు.
అడుగడుగునా నిర్లక్ష్యం - అస్తవ్యస్తంగా ఏపీపీఎస్సీ
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుంటుందని తెలుపుతూ గుంటూరు తెలుగు యువత (Guntur Telugu Youth) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. నెత్తిపై బుట్టలు పెట్టుకుని గ్రూప్-1, 2 ఉద్యోగాలను అమ్ముతామంటూ నిరసన తెలియజేస్తూనే సూట్ కేసుతో వచ్చి ఉద్యోగాలు కొనుక్కుంటున్నట్లుగా ప్రదర్శన చేశారు. గ్రూప్ 1, 2 పోస్టులను ప్రభుత్వం సంతలో పశువుల మాదిరిగా అమ్మకానికి పెట్టడంపై తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగులు, విద్యార్థులు, యువత తగిన గుణపాఠం చెబతారని హెచ్చరించారు. 2018 గ్రూప్-1 మెయిన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తెలిపారు.
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు - ఏపీ హైకోర్టు కీలక తీర్పు
జగన్ మాఫియా గ్రూప్ -1 ఉద్యోగాలు రూ.150 కోట్లకు అమ్ముకున్నదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ భవన్, అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.