ETV Bharat / politics

మోసం, దగా, కుట్రకు ప్యాంటు, షర్టు వేస్తే జగన్‌ : నారా లోకేశ్

Nara Lokesh Sankharavam Yatra: ఉత్తరాంధ్ర తెలుగుదేశానికి కంచుకోట, పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు. అలాంటి ఉత్తరాంధ్రని జగన్ గంజాయి కేరాఫ్​ అడ్రస్​గా మార్చారని నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్ఛాపురం రాజావారి గ్రౌండ్స్‌లో జరిగిన శంఖారావం సభలో జగన్​పై లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

_lokesh_yatra.
_lokesh_yatra.
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 1:03 PM IST

Updated : Feb 11, 2024, 3:42 PM IST

మోసం, దగా, కుట్రకు ప్యాంటు, షర్టు వేస్తే జగన్‌ : నారా లోకేశ్

Nara Lokesh Sankharavam Yatra: ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నింటికీ భరోసా కల్పించేలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర చేపట్టారు. నవ్యాంధ్రకు నవశకం లిఖించే సమర నినాదంతో లోకేశ్‌ యాత్ర చేపట్టారు. శంఖారావం యాత్ర నేడు ఇచ్ఛాపురంలో జరిగిన తరువాత పలాస, టెక్కలిలోనూ కొనసాగనుంది. ఈ సభలో లోకేశ్‌, ఎంపీ రామ్మోహన్, కళా వెంకట్రావు నాయకులు, కార్యకర్తలు, జనసేన నేతలు పాల్గొన్నారు. యువగళం (Yuvagalam) పాదయాత్ర జరగని ప్రాంతాల్లో లోకేశ్‌ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఇచ్ఛాపురం రాజావారి గ్రౌండ్స్‌లో జరిగిన ప్రారంభ సభలో లోకేశ్‌ జగన్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జగన్​ మోసంపై ఆందోళన వద్దు, అధైర్యపడొద్దు - నిరుద్యోగులకు లోకేశ్​ బహిరంగ లేఖ

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకే 'సిద్ధం': ఉత్తరాంధ్ర తెలుగుదేశానికి కంచుకోటని పౌరుషాలు, పోరాటాలకు మారుపేరని అలాంటి ఉత్తరాంధ్రని జగన్ గంజాయి రాజధానిగా మార్చారని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు 'సిద్ధం' పేరుతో జగన్‌ మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. వైసీపీ భూకబ్జాలకు సహకరించలేదని విశాఖలో తహశీల్దార్‌ను కొట్టి చంపారని విమర్శించారు. యువతను మోసం చేసేందుకు డీఎస్సీ పేరుతో జగన్‌ కొత్త నాటకాలు మొదలు పెట్టారని లోకేశ్​ అన్నారు. మోసం, దగా, కుట్రకు ప్యాంటు, షర్టు వేస్తే జగన్‌లా ఉంటుందని ధ్వజమెత్తారు. 6 వేల డీఎస్సీ పోస్టుల పేరుతో మళ్లీ మోసానికి సిద్ధమయ్యారన్న లోకేశ్ టీడీపీ- జనసేన ప్రభుత్వం వచ్చాక ఏటా డీఎస్సీ (DSC) నిర్వహిస్తామని హామీఇచ్చారు.

కుటుంబానికే రక్షణ లేదు: జగన్‌ తన కుటుంబసభ్యులకే రక్షణ కల్పించట్లేదు చెల్లెళ్లు షర్మిల, సునీత తమకే భద్రత లేదంటున్నారు అలాంటి జగన్ సొంత చెల్లెలకే భద్రత ఇవ్వకపోతే సాధారణ మహిళల పరిస్థితేంటని లోకేశ్ ప్రశ్నించారు. దేశంలో వంద సంక్షేమ పథకాలు కోతపెట్టిన ఏకైక సీఎంగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. టీడీపీ- జనసేన ప్రభుత్వం వస్తే ప్రతి రైతుకు అండగా ఉండేందుకు రూ.20 వేలు అందిస్తామని ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని 18 నుంచి 59 ఏళ్ల మహిళకు ప్రతి నెల రూ.1500 అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం - వైసీపీకి కప్పం కట్టాలని వేధిస్తారా?: నారా లోకేశ్

తెలుగుదేశం బలం కార్యకర్తలే: జగన్‌ ఇచ్ఛాపురానికి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు కానీ టీడీపీ- జనసేన వచ్చాక పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని అన్నారు. అలానే కొబ్బరి, జీడిపప్పు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రతి రైతుకు అండగా ఉంటామని అన్నారు. తెలుగుదేశం (Telugu Desam) బలం కార్యకర్తలేనని పసుపు జెండా చూస్తే ప్రజలకు నూతన ఉత్సాహం వస్తుందని అన్నారు. కార్యకర్తల పార్టీ అంటే ప్రజలకు మొదటగా గుర్తుకు వచ్చేది టీడీపీ అని అన్నారు. కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం ఏర్పాటు చేశామని ప్రతి కార్యకర్త కుటుంబాలకు రూ.వంద కోట్లు అందజేశామని లోకేశ్ తెలిపారు. చంద్రబాబుపై, నాపై ఎన్నో దొంగ కేసులు పెట్టారు అలా మాపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని అన్నారు.

ఆ కసి నాలో ఉంది - రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా చేస్తా : లోకేశ్

ఎవ్వరినీ వదిలిపెట్టం: చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్‌బుక్‌ (Red Book) లో ఉన్నాయని వారిపై న్యాయ విచారణ జరిపిస్తామని లోకేశ్ హెచ్చరించారు. తెలుగుదేశం వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాన్ని ప్రతి గడపకు చేర్చాలని నేతలకు లోకేశ్ సూచించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో పోరాడుదామని పిలుపునిచ్చారు. జగన్​ను సాగనంపేందుకు పవన్‌ కూడా ముందుకొచ్చారు కాని వైసీపీలో పేటీఎం బ్యాచ్‌ ఉంది మనమధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తుందని అన్నారు. దొంగ పోస్టులు పెడితే కార్యకర్తలు స్పందించవద్దని జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపే లక్ష్యంతో కలిసి పనిచేద్దామని లోకేశ్ అన్నారు.

MP Rammohan: రైతులకు న్యాయం జరగాలంటే టీడీపీ- జనసేన ప్రభుత్వం రావాలని ఎంపీ రామ్మోహన్‌ అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కాలువల్లో తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేలా లోకేష్‌ నాయకత్వం ఉందని రామ్మెహన్‌ అన్నారు.

Last Updated : Feb 11, 2024, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.