ETV Bharat / politics

సజ్జల, పేర్ని నానిని వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి - Bhumireddy on Sajjala Perni Nani - BHUMIREDDY ON SAJJALA PERNI NANI

TDP MLC Bhumireddy on Sajjala and Perni Nani: సజ్జల, పేర్ని నానిని వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి డిమాండ్ చేశారు. కౌంటింగ్ రోజు గొడవలకు సజ్జల, పేర్ని నాని కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఇద్దరినీ పోలీసుల ఆధీనంలో ఉంచాలని కోరారు.

TDP_MLC_Bhumireddy_on_Sajjala_and_Perni_Nani
TDP_MLC_Bhumireddy_on_Sajjala_and_Perni_Nani (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 12:46 PM IST

Updated : Jun 3, 2024, 1:25 PM IST

సజ్జల, పేర్ని నానిని వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి (ETV Bharat)

TDP MLC Bhumireddy on Sajjala and Perni Nani: కౌంటింగ్​ రోజు అల్లర్లకు పిలుపునిచ్చిన సజ్జల, పేర్ని నానిని వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డిమాండ్‌ చేశారు. కౌంటింగ్ రోజు గొడవలు సృష్టించాలని సజ్జల, పేర్ని నాని ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఆ ఇద్దరినీ పోలీసుల ఆధీనంలో ఉంచుకోవాలని కోరారు. 4వ తేదీ తర్వాత ఉద్యోగస్తుల అంతు తేలుస్తాం అని మాజీ మంత్రి పేర్ని నాని అన్న మాటలకు ఎవరూ భయపడరని అన్నారు.

పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు - కౌంటింగ్​ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశం - SC on MLA Pinnelli Case

ఒకవైపు తాము గెలుస్తాం అంటూనే వైఎస్సార్సీపీ నేతలు మరోవైపు బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం రోజు ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్​పై భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఆరా మస్తాన్ 1వ తేదీ సజ్జల, భార్గవ రెడ్డితో నాలుగు గంటలు భేటీ అయ్యారన్న ఆయన, సజ్జల ఇచ్చిన ఫలితాలను ఆరా మస్తాన్ చదివారని దుయ్యబట్టారు.

"సజ్జల, పేర్ని నానిని వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి. కౌంటింగ్ రోజు గొడవలకు సజ్జల, పేర్ని నాని కుట్రలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఇద్దరినీ పోలీసుల ఆధీనంలో ఉంచుకోవాలి. 1న ఆరా మస్తాన్ సజ్జల, భార్గవరెడ్డితో 4 గంటలు భేటీ అయ్యారు. సజ్జల ఇచ్చిన ఫలితాలను ఆరా మస్తాన్ చదివారు. నాలుగో తేదీన ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటం ఖాయం." - భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ

ఏపీలో కూటమికి జైకొట్టిన యాక్సిస్‌ ఇండియా టుడే సర్వే

Last Updated : Jun 3, 2024, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.