ETV Bharat / politics

గుంటూరు జీజీహెచ్​లో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఓవరాక్షన్​ - రోగుల ఇబ్బందులు - JAGAN IN GGH

గుంటూరు పర్యటనలో జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం - శవాల చుట్టూ రాజకీయం చేయటం హాస్యాస్పదమని వ్యాఖ్య

TDP Leaders Fire on Jagan Comments
TDP Leaders Fire on Jagan Comments (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 6:17 PM IST

YSRCP Activists Overaction in YS Jagan Tour : గుంటూరు జిల్లా తెనాలిలో ప్రియుడి చేతిలో దాడికి గురై జీజీహెచ్​లో చికిత్స పొందుతూ మరణించిన సహన మృతదేహాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించారు. సహన కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఓవరాక్షన్​ చేశారు. వేలాది మంది రోగులు వచ్చే జీజీహెచ్ ప్రాంగణంలోకి జగన్ వెంట వందలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని అనుమతించారు. జగన్ జీజీహెచ్​లో ఉన్న గంటన్నర సేపు వారు ఆసుపత్రి పరిసరాల్లో గందరగోళం సృష్టించారని రోగుల బంధువులు అన్నారు.

వైఎస్సార్సీపీ నేతల అరాచకం కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడ్డారు. జగన్ వచ్చి వెళ్లే వరకూ ఆసుపత్రి ప్రధాన గేటు మూసివేశారు. దీంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆసుపత్రిలో అత్యవసర విభాగానికి వెళ్లే మార్గం వద్ద అడ్డుగా నిల్చున్నారు. అంబులెన్సులు కూడా రాలేని పరిస్థితి కల్పించారు.

ఈ సందర్బంగా జగన్​ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సహనపై దాడి చేసిన నవీన్​కు టీడీపీ వారితో సంబంధాలున్నాయి కాబట్టే కాపాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటన జరిగిన వెంటనే తోడుగా ఉన్నామని రాష్ట్రం ప్రభుత్వం భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

TDP Leaders Fire on Jagan Comments: జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉండగా దళితులు, మైనార్టీలు, వెనుకబడిన వర్గాల వారు హత్యకు గురైనప్పుడు జగన్ వారిని ఎప్పుడైనా పరామర్శించారా అని ఆలపాటి ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై కనీసం నోరు మెదపలేదని గుర్తు చేశారు. వివేకా హత్య విషయంలో విపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేసి, అధికారంలోకి వచ్చాక నోరు విప్పలేదని ఎద్దేవా చేశారు. నేరపూరిత ఆలోచనలతో కూడిన పాలన జగన్ ఐదేళ్లు చేశారని దుయ్యబట్టారు.

శవాల చుట్టూ రాజకీయం : ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ జగన్ ఎక్కడ శవం కనిపిస్తే అక్కడకు వెళ్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం మహిళలు, ఆడపిల్లల భద్రత విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తోందని, హోంమంత్రి నేరుగా వెళ్లి బాధితులను పరామర్శించి పరిహారం అందిస్తున్నారని తెలిపారు.

'జగన్​కు బాధ్యత లేదు - గుడ్ బుక్​ కాదు గుండె బుక్ ఉండాలి' - వైఎస్సార్సీపీకి రాజీనామా

దేవుడు పైనుంచి చూస్తారని అంటున్న జగన్ భగవంతుడు చూశారు కాబట్టే వైఎస్సార్సీపీకి 11సీట్లు ఇచ్చిన విషయం గుర్తించాలని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా శవాల చుట్టూ రాజకీయం చేయటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. లేని దిశ చట్టం గురించి గొప్పలు చెప్పటం జగన్​కే చెల్లిందని విమర్శించారు. వరద బాధితులకు ప్రకటించిన రూ.కోటి సాయానికే దిక్కు లేదని, ఇప్పుడు ప్రకటించిన 10లక్షల సాయం ఎప్పుడిస్తారని జగన్​ను ప్రశ్నించారు.

తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు - జగన్​కు మంత్రి లోకేశ్‌ హెచ్చరిక

గందరగోళం సృష్టించిన వైఎస్సార్సీపీ నేతలు :

ప్రేమ 'చెల్లి'పోయింది - ఆస్తుల వివాదంపై కోర్టుకెక్కిన జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.