ETV Bharat / politics

'ఎమ్మెల్సీ అనంతబాబును బర్తరఫ్ చేయాలి - మైనార్టీలపైనా జగన్​కు గౌరవం లేదు' - PROTEST AGAINST MLC ANANTHA BABU

Protest against YCP MLC Anantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సమతా సైనిక్ దళ్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సంయుక్తంగా తీర్మానించాయి. కర్నూలులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలని చెప్పడం వరకే గానీ వారిపై ఆయనకు ఎలాంటి గౌరవం లేదని తెలిపారు.

attacks_on_dalits_and_minorities_during_ysp_regime

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 7:19 PM IST

Protest against YCP MLC Anantha Babu: వైసీపీ హయాంలో దళితులు, మైనార్టీలపై ఎక్కువగా దాడులు కొనసాగుతున్నాయని సమతా సైనిక్ దళ్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సమతా సైనిక్ దళ్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కర్నూలులో నిర్వహించారు. ఈ సమావేశానికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారుఖ్​ షిబ్లీ‌, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలని చెప్పడం వరకే గానీ వారిపై ఆయనకు ఎలాంటి గౌరవం లేదని తెలిపారు.

దళితులు, గిరిజనులపై పెరుగుతున్న దాడులు - ఎక్కువశాతం నిందితులు వైసీపీ నేతలే

Attacks on Dalits and Minorities During YSP regime: తమ పోరాటం వల్లే ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్న కోడి కత్తి శీనును విడుదల చేయించామని తెలిపారు. ఆ తరహాలోనే ఎమ్మెల్సీ అనంత బాబును ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేసేంతవరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబును ముఖ్యమంత్రి తన పక్కన పెట్టుకోవడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన హత్య కేసును సీబీఐ కి అప్పగించాలని వారి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ముకుమ్మడిగా వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు.

దళితులను తిట్టడం, కొట్టడం, గుండు గీయించడం, చంపి డోర్ డెలివరీ చేయడం!

తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఇస్లాంపేటలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగు దేశం పార్టీ బీసీ సెల్ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ప్రజా ఆమోదయోగ్యమైన బీసీ డిక్లరేషన్ ను ప్రకటించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలు ఆనందోత్సవాలు తెలుపుతున్నారని, బీసీలపై అణిచివేత ధోరణిలో పరిపాలన చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కి రాబోయే ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ తెలిపారు.

పెత్తందార్లకే పెత్తనం అప్పగిస్తున్న జగన్‌ - అగ్రవర్ణాల కిందే ఎస్సీ నియోజకవర్గాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.