YSRCP Central Office in Tadepalli: రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేక ఫలితాలతో వైఎస్సార్సీపీలో తీవ్ర నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. ఘోర పరాజయం దిశగా వైఎస్సార్సీపీ వెళ్తుండటంతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం బోసి పోయింది. పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి సహా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ఫలితాలను చూసి పార్టీ కార్యాలయానికి వచ్చిన కొద్ది పాటి వైఎస్సార్సీపీ శ్రేణులూ వెనుతిరిగాయి.
దీంతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సైతం ఎవరూ లేక బోసిపోయింది. సీఎం క్యాంపు కార్యాలయం వైపు వైఎస్సార్సీపీ నేతలు కన్నెత్తి చూడలేదు. ఇంత ఘోరమైన ఫలితాలు వస్తాయని ఊహించలేదని వైఎస్సార్సీపీ నేతలు చెప్పుకుంటున్నారు.
పడిలేచిన కెరటం - ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం - ap elections 2024
మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రం నుంచి గుడివాడ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ బయటికి వెళ్లిపోయారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రం నుంచి పామర్రు వైఎస్సార్సీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ కూడా బయటికి వెళ్లిపోయారు. కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు టీవీలో చూసి తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి నాని వెళ్లిపోవడం అతనికి అప్పుడే ఓటమి ఖాయమని భావించినట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కౌంటింగ్లో మెజారిటీ తగ్గడంతో వైఎస్సార్సీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి హుటా హుటిన కారులో ఇంటికి వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు సైతం కౌంటింగ్ జరుగుతుండగా మధ్యలోనే ఇంటికి జారుకున్నారు.
ఏపీలో కూటమి జోరు - రాజమండ్రి గ్రామీణంలో తొలి విజయం - TDP CANDIDATES WINNING IN AP