Polling in AP : ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు బారులుదీరారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఓ వైపు ఎండలు మరో వైపు వర్ష సూచన నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ ప్రారంభంలోనే తరలివచ్చారు.
నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 1,717మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణ 17, ఉత్తర ప్రదేశ్ 13 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే విధంగా మహారాష్ట్ర 11, మధ్యప్రదేశ్ 8, బంగాల్‌లో 8, బిహార్ 5, ఒడిశా 4, ఝార్ఖండ్ 4, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. దేశంలో ఇప్పటివరకు జరిగిన మూడు విడతల్లో 283 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్ 1న చివరి విడత పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
LIVE UPDATES: ప్రారంభమైన పోలింగ్ - పల్నాడు గొడవలపై ఈసీ ఆగ్రహం - Andhra Pradesh Elections voting
నాలుగో విడత పోలింగ్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలం నెలకొంది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగనుంది.
అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకు పోలింగ్ ముగియనుండగా, పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 వరకు, 169 నియోజకర్గాల్లో సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఫలితాలతో పాటే అసెంబ్లీ ఫలితాలను వచ్చే నెల 4న వెల్లడించనున్నారు.
రండి! 'అమ్మ'కు ఓటేద్దాం- 'అన్నపూర్ణ'ను గెలిపిద్దాం! - Vote for Amaravati
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) ముఖేశ్ కుమార్ మీనా విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైల్వే కల్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఓటర్లెవరూ పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని అన్నారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు 209వ పోలింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. ఈవీఎంల నిర్వహణ తెలియక అధికారులు అయోమయంలో పడ్డారు. మరో వైపు ఇదే కేంద్రంలో ఓటర్లు బారులుదీరారు. బాపట్ల జిల్లా అద్దంకిలోని 156బూత్‌లో ఈవీఎం మొరాయించింది.
వైఎస్ వారసులు ఎవరు? - తేల్చేసిన విజయమ్మ - Vijayamma Support Sharmila