Political Leaders Tweets on TDP BJP JanaSena Alliance : ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తులపై ఆయా పార్టీల అగ్రనేతల ట్వీట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని నింపాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తులపై ఆయా పార్టీల అగ్రనేతల ట్వీట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని నింపాయి. మళ్లీ ఎన్టీఏలో చేరడం సంతోషంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి, దేశానికి సేవ చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసిట్లు తెలిపారు. బీజేపీ, జనసేనతో కలిసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఎదురుచూస్తున్నారని ఈ కూటమి ప్రజాశ్రేయస్సుకు స్వర్ణయుగం తెస్తుందనే నమ్మకముందన్నారు. ఏపీ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు చెప్పారు. చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకు ఉన్నట్లు వెల్లడించారు.
టీడీపీ,జనసేన, బీజేపీల మద్య పొత్తు పొడిచింది- ఏపీ ప్రజల కోసం పనిచేస్తామన్న బీజేపీ
ఎన్డీఏ బలమైన రాజకీయ వేదిక : టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను వేగంగా నెరవేర్చుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని చాటుతూ తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్డీయేలో చేరాయన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోదీ దార్శనికత నాయకత్వంలో ఎన్డీఏ బలమైన రాజకీయ వేదికగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
అమిత్ షా ట్యీట్కు చంద్రబాబు రీ ట్వీట్ : టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను వేగంగా నెరవేర్చుతుందన్న అమిత్ షా కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన అవకాశాలున్నాయని, రాష్ట్ర అభివృద్ధి అంతిమంగా మన దేశ వృద్ధికి దోహదపడుతుందని బాబు అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, ప్రధాని మోదీ నాయకత్వంలో మేము కొత్త శకానికి నాంది పలుకుతామని చంద్రబాబు రీ ట్వీట్ చేశారు.
దశాబ్దం పాటు గందరగోళ పరిస్థితి : ఎన్డీఏలో జనసేన, తెలుగుదేశం పార్టీలను భాగం చేసినందుకు మోదీ, అమిత్ షా, నడ్డాకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఒక దశాబ్దం పాటు గందరగోళ పరిస్థితి ఏర్పడిందని పవన్ అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇసుక అక్రమాలు, విలువైన ఖనిజాలు, సహజ వనరుల దోపిడీ పేరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మాఫియా, దేవాలయాల అపవిత్రత, ఎర్ర చందనం స్మగ్లింగ్, బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు జరిగాయని పవన్ చెప్పారు. జగన్ పాలనలో 30 వేల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితో వీటన్నింటికి ముగింపు పడుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లు - ఈ నెల 17 లేదా 18న ఉండొచ్చని చంద్రబాబు సంకేతాలు
చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా స్పందించారు. ఎన్డీఏలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మూడు పార్టీలూ పని చేస్తాయని నడ్డా పేర్కొన్నారు. దేశ ప్రగతికి, ఏపీ ప్రజల ఉన్నతికి మూడు పార్టీలూ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు..
ప్రజల జీవితాలను మార్చే ముఖ్యమైన మలుపు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలెక్కించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన ఏకతాటిపైకి వచ్చాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేసారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత ఐదేళ్లలో చీకటి దశను ఎదుర్కొన్న రాష్ట్రానికి ఇది కీలక పరిణామమన్నారు. మూడు పార్టీల కూటమి రాష్ట్రాన్ని, ప్రజల జీవితాలను మార్చే ముఖ్యమైన మలుపు కానుందని పేర్కొన్నారు.
ప్రత్యర్థులూ ఆయన్ను గౌరవిస్తారు- బాబు విజనరీ లీడర్ : అర్నాబ్ గోస్వామి