Polavaram Project Issue in Lok Sabha: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యానికి గుత్తేదారును మార్చడమే కారణమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2021లో ఐఐటీ హైదరాబాద్ ఇచ్చిన నివేదిక ఆలస్యానికి కారణాలు చెప్పిందన్నారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లోనూ జాప్యం జరిగిందని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ వివరించారు. పోలవరానికి గత మూడేళ్లలో కేంద్రం 8వేల 44కోట్ల 31లక్షల రూపాయలు ఇచ్చిందన్న మంత్రి.. పనుల పురోగతి వివరాలు కూడా సమాధానంలో పొందుపరిచారు. ప్రాజెక్టు తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటుకు చెప్పారు.
పోలవరం పనులు వెనకబడటానికి కారణం జగన్: మంత్రి నిమ్మల - Ministers Fires on Jagan