ETV Bharat / politics

పిన్నెల్లి ముందస్తు బెయిల్​ పిటిషన్లు - జూన్‌ 6 వరకు ఎలాంటి చర్యలు వద్దన్న హైకోర్టు - No Action Against MLA Pinnelli

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 7:12 PM IST

Updated : May 28, 2024, 12:19 PM IST

No Action Against MLA Pinnelli Till June 6: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.

Pinnelli Bail Petition
Pinnelli Bail Petition (ETV Bharat)

No Action Against MLA Pinnelli Till June 6: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ ఇప్పటికే ధర్మాసనం ఆదేశింది. మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లోనూ ఆ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్‌ 6 వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు స్పష్టం చేసింది.

Pinnelli Anticipatory Bail : పాల్వయిగేటు పోలింగ్‌ బూత్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడారు. ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళపై దుర్భాషలాడారు. కారంపూడిలో సీఐపై దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదైంది. ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉద్దేశపూర్వకంగానే పిటిషనర్‌పై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారన్నారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో జూన్‌ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారన్నారు. పోలీసుల తరఫున పీపీ వై.నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించే సమయంలో హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారన్నారు.

'ఓట్ల లెక్కింపు రోజున తీవ్ర అల్లర్లకు కుట్ర- పిన్నెల్లి బెయిల్​కు అనర్హుడు' - MLA Pinnelli Case

అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీ నుంచి తనకు సూచనలు అందాయన్నారు. పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్నారు. మధ్యంతర బెయిలు మంజూరు చేయవద్దని కోరారు. ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉందన్నారు.

పిన్నెల్లి దాడి బాధితుడు సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది ఎన్‌ అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. హత్యాయత్నం వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వడాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నారు. బెయిలు మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలలో సైతం పిన్నెల్లి ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు. బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు.

కాగా పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ద్వంసం కేసులో జూన్‌ 6 వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. కౌంటింగ్​ కేంద్రానికి వెళ్లడానికి ఓట్ల లెక్కింపు రోజు మాత్రమే హైకోర్టు అనుమతించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని పేర్కొంది. అయితే మిగతా మూడు కేసులపై ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జూన్​ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను జూన్​ 6కు వాయిదా వేసింది.

మాచర్లలో వైఎస్సార్సీపీ అరాచకాలు - మహిళపై కత్తితో దాడి - Pinnelli follower attacked on woman

ఒక కేసులో అరెస్టొద్దంటే మొత్తానికే వదిలేస్తారా?- పిన్నెల్లిపై పోలీసుల స్వామిభక్తి - PINNELLI CASE

Last Updated : May 28, 2024, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.