Pawan Kalyan Suggestions to Jana Sena Activists on Alliances: పొత్తులపై జనసేన కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కీలక సూచనలు చేశారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యమన్నారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే పొత్తులు కుదుర్చుకున్నట్లు తెలిపారు. పార్టీ విధానాలకు తమ అభిప్రాయాలను ప్రచారం చేయొద్దని అన్నారు. ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారని పవన్ కార్యకర్తలకు సూచించారు.
పథకాలు ఎట్టి పరిస్థితిల్లో ఆగవు - ఎంత ఉదారంగా ఇవ్వగలమో చూపిస్తాం: పవన్
పొత్తులకు సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే తన రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావొచ్చని పవన్ తెలిపారు. తద్వారా కార్యకర్తల ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరతాయని పవన్ అన్నారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవలసిందిగా ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చినట్లు పవన్ పేర్కొన్నారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించక మానరని పవన్ అన్నారు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారన్న పవన్ ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండటం అవశ్యమని స్పష్టం చేశారు.
పార్టీ విరాళాల చెక్కులు వెనక్కి పంపిన జనసేనాని - ఎందుకలా చేయాల్సి వచ్చింది
Chandrababu Pawan Kalyan Meeting: సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల రెండుసార్లు భేటీ అయ్యారు. సీట్ల ఖరారుపై చంద్రబాబు- పవన్ కల్యాణ్ రెండుసార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పొత్తుల వల్ల రెండు పార్టీల్లో సీట్లు కోల్పోతున్న నేతలను ఆయా పార్టీల అధిష్టానం నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తరువాత సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
కులగణనపై ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి - సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ లేఖ
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుంచి సొంత వాహనంలో తానే నడుపుతూ పవన్ ఒక్కరే చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పవన్ వెళ్లిన తర్వాత ఆయన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుంది. తన నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి, శాలువా కప్పి, ఆహ్వానించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పవన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ మాత్రమే భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ఇప్పటికే ప్రకటించగా, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అదే స్థానం నుంచి తిరిగి జనసేన అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.