ETV Bharat / politics

పిఠాపురంలో ఉత్సాహంగా సాగిన పవన్‌ రోడ్‌ షో - దారి పొడవునా జనం నీరాజనాలు - Pawan Kalyan Road Show - PAWAN KALYAN ROAD SHOW

Pawan Kalyan Road Show in Pithapuram Constituency: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో ఉత్సాహంగా సాగింది. పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పవన్ రోడ్ షో కొనసాగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గాజు గ్లాస్​కు, కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. రోడ్‌ షోలో దారి పొడవునా పవన్‌కు జనసేన అభిమానులు అభివాదం చేస్తూ సందడి చేశారు. మహిళలు మంగళహారతులు, పుష్పాలు సమర్పించి అభిమానం చాటారు.

pawan_kalyan_road_show
pawan_kalyan_road_show (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 7:57 PM IST

Updated : May 10, 2024, 10:32 PM IST

Pawan Kalyan Road Show in Pithapuram Constituency: వైసీపీ ప్రభుత్వంలో ప్రజల భూములకు, ఆడబిడ్డలకు రక్షణ లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ ప్రారంభమైన పవన్‌ రోడ్‌ షో ఎంతో ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర భవిష్యత్తు, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గాజు గ్లాస్​కు, కూటమికి ఓటు వేసి గెలిపించాలని పవన్‌ కల్యాణ్ కోరారు. రోడ్‌ షోలో దారి పొడవునా పవన్‌కు జనసేన అభిమానులు అభివాదం చేస్తూ సందడి చేశారు.

సొంతూళ్లకు పయనమైన ఏపీ ఓటర్లు- ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు - Passengers PROBLEMS DUE TO NO BUSES

మహిళలు మంగళహారతులు, పుష్పాలు సమర్పించి అభిమానం చాటారు. నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి తాగునీటి సమస్యలు పరిష్కరిస్తానని కాకినాడ ఎస్​ఈజడ్​లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి ఉపాధి కల్పిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పిఠాపురం ప్రజలు తనకు అండగా నిలిచారని, ఆశీర్వదించారని పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము - తిరువూరులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ భర్తపై కేసు - 38 lakhs Seized in Satyasai

యువత ఉత్సాహం: పవన్ కల్యాణ్ రోడ్ షోలో పిల్లలు, యువతను వాహనం పైకి ఎక్కించుకొని వారిని ఉత్సాహపరిచారు. పవన్ కల్యాణ్​ను చూడగానే పిల్లలు యువత కేరింతలు కొట్టారు. గొల్లప్రోలులో ఇద్దరు బాలురుతో ముచ్చటించారు. ఓ బాలుడు సైన్యంలో చేరతానని, మరో బాలుడు పోలీసు అధికారి అవుతానని పవన్ కల్యాణ్​కు చెప్పారు. ఓ బాలుడు తాను చేయిపైన వేసుకున్న పచ్చబొట్టును పవన్ కల్యాణ్​కు చూపించి అభిమానం చాటుకున్నారు. బాలుడి అభిమానానికి పవన్ కల్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు. గొల్లప్రోలు ఈబీసీ కాలనీలో ఓ బాలుడు పవన్ వాహనం పైకి ఎక్కి మా ఇంట్లో పది ఓట్లున్నాయ్ పవన్​కే వేయిస్తానంటూ చెప్పడంతో జనం కేరింతలు కొట్టారు. ఆ బాలుడుతో పవన్ సెల్ఫీ తీసుకున్నారు.

చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించిన అన్నగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు: షర్మిల - YS Sharmila Allegations on Jagan

భూ హక్కు చట్టానికి తాను బాధితుడ్ని: పవన్ కల్యాణ్ రోడ్డు షోకు వచ్చిన ఓ జనసైనికుడు భూ హక్కు చట్టానికి తాను బాధితుడ్ని అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేయాలంటూ ఫ్లెక్సీ ప్రదర్శించారు. దుర్గాడకు చెందిన గంగాధర్ గ్రామంలోని సర్వే నెంబర్ 95లో 50 సెంట్ల భూమిని రీ సర్వే చేయగా 15 సెంట్లు తక్కువ చూపరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చట్టం రద్దు చేసి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Last Updated : May 10, 2024, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.