Ongole MP Magunta Srinivasulu Reddy Join in TDP : వైఎస్సార్సపీని ఆ పార్టీ ఎంపీలు ఒక్కక్కురుగా వీడుతున్నారు. తాజాగా అదే కోవలో అధికార పార్టీలో అవమానాలు ఎదుర్కొన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీని వీడారు. శనివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మాగుంటతో పాటు ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయం తిరగబడిందని, దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
మాగుంటతో పాటు ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వల్లభనేని బాలశౌరి, సంజీవ్ కుమార్, రఘురామకృష్ణ రాజు ఇప్పటికే అధికార పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున తన కుమారుడు రాఘవరెడ్డిని బరిలోకి దింపాలని మాగుంట భావిస్తున్నారు.
టీడీపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పోటీ- ఎంపీ మాగుంటతో తెలుగుదేశం పార్టీ నేతల భేటీ
నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి సైతం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. అద్దంకి అధికార పార్టీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య పసుపు కండువా కప్పి చంద్రబాబు టీడీపీ లోకి ఆహ్వానించారు. వంటేరు వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం అధికార పార్టీకి రాజీనామా చేసిన అనంతరం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉంటే సరైన గుర్తింపు లేదని, హీనంగా చూశారని తెలిపారు. గతంలో ఉదయగిరి, కావలి అభ్యర్థుల విజయానికి పని చేశానని ఆయన గుర్తు చేశారు. ఆత్మాభిమానం చంపుకొని పార్టీలో ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
Pithapuram Former MLA Varma Met Chandrababu Naidu : పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడంతో, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో మాట్లాడేందుకు చంద్రబాబు ఇంటికి పిలిపించారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ ఎంతో కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో వర్మను సహకరించాలని కోరామన్నారు. పవన్ కల్యాణ్ గెలుపునకు సహకరిస్తానని వర్మ హామీ ఇచ్చారని చంద్రబాబు స్పష్టం చేశారు. సీటు త్యాగం చేసిన వర్మకు మొదట విడతలో ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. పవన్‌ను అత్యధిక మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిపించాలని పిలుపునిచ్చారు. వర్మ అభ్యర్థి అయితే ఎలా పని చేస్తారో అంతకు పదిరెట్లు ఉత్సాహంతో తెలుగుదేశం కార్యకర్తలు, వర్మ అభిమానులు పవన్ గెలుపు కోసం పని చేయాలని సూచించారు.
పిఠాపురం నుంచి బరిలో పవన్‌కల్యాణ్ - స్వయంగా వెల్లడించిన జనసేనాని
అధినేత ఆదేశాల మేరకు పని చేస్తా : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పిఠాపురంలో పని చేస్తానని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం కోసం కృషి చేస్తామన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబును కోరినట్లు వివరించారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తుండటంతో వర్మను పిలిచి చంద్రబాబు మాట్లాడారు. పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారని వర్మకు తగిన న్యాయం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
సిద్ధం, సిద్ధం అని కోకిలలా కూస్తున్న వ్యక్తికి యుద్ధమే ఇద్దాం: పవన్ కల్యాణ్