Nellore TDP Leaders Meeting : అధికార పార్టీకి కంచుకోట అయిన నెల్లూరు జిల్లాలో ఫ్యానుకు ఎదురుగాలి వీస్తోంది. ఈ తరుణంలో జిల్లాలో టీడీపీ అభ్యర్ధుల ఖరారుతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అలాగే వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, మండల, గ్రామ స్థాయి నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ప్రచార జోరుతో ముందుకు కొనసాగుతున్నారు. ఈ తరుణంలో జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం తప్పా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఖరారుతో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా నెల్లూరులోని జగనన్న భవన్లో డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఎన్నికల కన్నా ముందే నెల్లూరులో వైసీపీ ఖాళీ !
Nellore District TDP MLA Candidates are Finalised : సీఎం జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడానికే తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు, అలాగే ఎంపీ సీటు కూడా గెలుస్తామని, క్లీన్ స్వీప్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి అత్యధిక సీట్లతో, అత్యధిక మెజార్టీతో విజయం కైవసం చేసుకోబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన అభివృద్ధి పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు.
నెల్లూరులో వైసీపీ నేతలే లేరు - అన్ని స్థానాలు టీడీపీ గెలుస్తుంది: మాజీ మంత్రి నారాయణ
"నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా మేము కృషి చేస్తాం. సీఎం జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించాలి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ కూటమి అత్యధిక సీట్లతో, అత్యధిక మెజార్టీతో విజయం కైవసం చేసుకోబోతుంది."- పొంగూరు నారాయణ, మాజీ మంత్రి
"రాబోయే ఎన్నికల్లో మనమందరం నారాయణను గెలిపించుకోవాలి. అలాగే నేను కూడా ఎంపీగా పోటీ చేస్తున్నాను. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా మనందరం కలిసి గెలిపించుకోవాలి. మా ముగ్గురికి మీ ఆశీస్సులు ఉండాలి. సీఎంగా నారా చంద్రబాబు నాయుడుని చూడాలి."- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేత
వేమిరెడ్డి ఇంట తెలుగు తమ్ముళ్ల సందడి- స్వయంగా ఆహ్వానించిన తెలుగుదేశం నేతలు