ETV Bharat / politics

అవినీతిపై చర్చకు సిద్ధం - ఎవరు ఎంత చేశారో చర్చలో తేలిపోతుంది: నారా లోకేశ్ - నారా లోకేశ్ శంఖారావం మీటింగ్

Nara Lokesh Shankharavam Meeting at Pathapatnam: అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. ఈ చర్చతో ఎవరి అవినీతి ఎంటో తేలిపోతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడారు. మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ బోర్డులు పెడుతున్నారని కానీ సొంత తల్లి, చెల్లే నమ్మట్లేదని ఎద్దేవా చేశారు.

Nara_Lokesh_Shankharavam_Meeting
Nara_Lokesh_Shankharavam_Meeting
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 1:47 PM IST

అవినీతిపై చర్చకు సిద్ధం - ఎవరు ఎంత చేశారో చర్చలో తేలిపోతుంది: నారా లోకేశ్

Nara Lokesh Shankharavam Meeting at Pathapatnam: జగన్‌ చెప్పేవన్నీ అసత్యాలే అని, రోజుకు ఒక మోసం, అబద్ధం చెప్పడమే పని అయిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఎన్నికల ముందు జగన్‌ తియ్యగా మాటలు చెప్పారని, ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చాక అన్నీ మరచిపోయారని మండిపడ్డారు. ఏటా డీఎస్సీ అని చెప్పిన జగన్, నాలుగున్నరేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు ఎన్నికల సమయంలో నోటిఫికేషన్‌ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగించారు.

నిరుద్యోగులు అధైర్యపడవద్దు: వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు మూసేశారని, విదేశీ విద్య కూడా ఆపేశారని అన్నారు. ఏటా కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీ అన్నారు అని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దన్న లోకేశ్, రెండు నెలలు ఓపిక పట్టండని తెలిపారు.

వైసీపీకి అంతిమ'యాత్ర'గా మారిపోయింది: కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి యాత్ర-2 సినిమా తీశారని కానీ అది కాస్తా వైసీపీకి అంతిమయాత్రగా మారిపోయిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. డబ్బులిచ్చి సినిమాకు పొమ్మన్నా ఎవరూ వెళ్లట్లేదని అన్నారు. అర్జునుడు, అభిమన్యుడు అని జగన్‌ చెబుతుంటారని, నిజానికి జగన్‌ ఒక సైకో, భష్మాసురుడు అని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు జగన్‌ రంగులు వేసుకుంటున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేల బదిలీలతోనే ఓటమిని ఒప్పుకున్నారు- దిల్లీలో కూడా బైబై జగన్ అంటున్నారు: నారా లోకేశ్​

బాంబులకే భయపడని కుటుంబం మాది: ఈమధ్య జగన్‌ ప్రసంగాలలో మీ బిడ్డ, మీ బిడ్డ అంటున్నారని జాలిపడవద్దన్న లోకేశ్, పొరపాటున ఎన్నికల్లో గెలిస్తే మీ బిడ్డనే కదా మీ భూమి తీసుకుంటానంటారని విమర్శించారు. జగన్‌ అంటే జైలు, బాబు అంటే ఒక బ్రాండ్‌ అని లోకేశ్ తెలిపారు. జగన్‌ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుందని, చంద్రబాబును చూస్తే కియా కారు గుర్తొస్తుందని అన్నారు. జగన్‌ను చూస్తే ప్రిజనరీ కనిపిస్తే, బాబును చూస్తే విజనరీ కనిపిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే కార్యకర్తలు భయపడతారని అనుకున్నారని, కేసులకు భయపడేది లేదని జగన్‌ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బాంబులకే భయపడని కుటుంబం తమదన్న లోకేశ్, పనికిమాలిన కేసులకు భయపడతామా అని ప్రశ్నించారు.

అవినీతిపై చర్చకు సిద్ధం: అవినీతిపై చర్చకు సిద్ధమని సీఎం జగన్‌కు నారా లోకేశ్ సవాల్‌ చేశారు. ఎవరు ఎంత అవినీతి చేశారో చర్చలో తేలిపోతుందని అన్నారు. మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ బోర్డులు పెడుతున్నారని, సొంత అమ్మ, చెల్లి జగన్​ని నమ్మట్లేదని ఇక ప్రజలు ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. ప్రాణహాని ఉందని షర్మిల, సునీత చెప్పే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేని జగన్‌, మనకు రక్షణ కల్పిస్తారా? అని ప్రశ్నించారు. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన షర్మిలను బెదిరిస్తున్నారని తెలిపారు.

వచ్చేది టీడీపీ,జనసేన ప్రభుత్వమే - చక్రవడ్డీతో సహా అన్నీ చెల్లిస్తాం: నారా లోకేశ్

జగన్‌కు 2 బటన్లు ఉంటాయి: జగన్‌ను చూస్తే కటింగ్‌, ఫిట్టింగ్‌ మాస్టర్‌ గుర్తొస్తారని లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్‌కు 2 బటన్లు ఉంటాయని, బల్లపై బ్లూ బటన్‌, బల్ల కింద ఎర్ర బటన్‌ అని విమర్శించారు. బ్లూ బటన్‌ నొక్కితే ఖాతాలో రూ.10 పడతాయని, ఎర్ర బటన్‌ నొక్కగానే రూ.100 పోతాయని అన్నారు. వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని తెలిపారు. భవిష్యత్తులో గాలికి కూడా జగన్‌ పన్ను వేసి వసూలు చేస్తారని, సంక్షేమ పథకాలన్నీ జగన్‌ కట్‌ చేసుకుంటూ వెళ్తున్నారని మండిపడ్డారు.

మూతబడిన పరిశ్రమలన్నీ తెరిపిస్తా: ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించిన లోకేశ్, టీడీపీ - జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత మూతబడిన పరిశ్రమలన్నీ తెరిపిస్తానని హామీ ఇచ్చారు. కనీసం షుగర్‌ ఫ్యాక్టరీ అయినా తెరిపించారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి అయినా జరిగిందా అని నిలదీశారు.

జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు- పరిశ్రమల ఏర్పాటుతో ఉత్తరాంధ్ర వలసలను నిరోధిస్తాం: లోకేశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.