Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: 'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఫిరంగిపురం మండలం కండ్రికలో మృతుడు నల్లజర్ల చెన్నకేశవరావు, తాడికొండ మండలం బండారుపల్లిలో తూమాటి బాలయ్య కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించిన ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
మృతులకు నివాళులర్పించిన ఆమె ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయంగా చెక్కును అందజేశారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. అనంతరం కండ్రికలో వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం తుళ్లూరు మండలంలో ఆమె పర్యటన సాగింది.
బాపట్లలో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర - పలు కుటుంబాలకు పరామర్శ
Nara Bhuvaneswari in Guntur District: ఈ క్రమంలో వెంకటపాలెం గ్రామంలో మహిళా పాడి రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. రాజధాని కోసం 1500 రోజులుగా పోరాడుతున్న అమరావతి రైతులందరికీ పాదాభివందనాలు తెలిపారు. అమరావతి ఉద్యమంలో మహిళా శక్తి ఏంటో ఇక్కడి మహిళలు చాటారని కొనియాడారు. పోలీసుల దౌర్జన్యాలు, దాడులు, అక్రమ అరెస్టులు ఇలా ఎన్నో అవమానాలు అమరావతి మహిళలు భరించారన్నారు. కడుపుతో ఉన్న మహిళను బూటుకాలితో తన్ని పుట్టబోయే బిడ్డను కూడా పోలీసులు చంపేశారని మండిపడ్డారు. అమరావతి మహిళలు ఎవరూ నిరుత్సాహపడొద్దని ధైర్యం చెప్పారు.
తెలుగుదేశం కార్యకర్తలకు భరోసానిస్తూ - రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటన
త్వరలోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతోపాటు మహిళలంతా స్వయం శక్తితో ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఆడబిడ్డలకు విద్యావకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. మహిళలు తమకు తాము తక్కువ అంచనా వేసుకోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఇల్లు, వ్యాపారం, పిల్లలు ఇలా అన్ని బాధ్యతలు మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరన్నారు. తాను, తన కోడలు బ్రాహ్మణి ఇద్దరూ కలిసి హెరిటేజ్ సంస్థను నడిపిస్తున్నట్లు గుర్తు చేశారు. తాను ఇంట్లోనే కూర్చుని ఉండి ఉంటే హెరిటేజ్ పేరుతో ముందుకెళ్లి ఎందరికో ఉద్యోగాలు కల్పించటం సాధ్యం కాకపోయేదన్నారు. మహిళలంటే చంద్రబాబుకు ఎంతో గౌరవం కాబట్టే 1994లో హెరిటేజ్ బాధ్యతలు తనకు అప్పగించారని చెప్పారు. హెరిటేజ్‌ని ముందుకు తీసుకెళ్లటంలో చంద్రబాబు తనలో ఎంతో స్ఫూర్తి నింపారని కొనియాడారు.
కర్నూలు జిల్లాలో నిజం గెలవాలి యాత్ర - పలు కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శ