Nara Bhuvaneshwari at NTR Sanjeevani Clinic Opening: వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో తిరుగులేని పోరాటానికి తెలుగుదేశం కార్యకర్తలు, యువత సిద్ధంగా ఉండాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వైసీపీని గద్దె దించడానికి ఓటును ఆయుధంగా వాడాలని కోరారు. చంద్రబాబు పాలన వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందన్నారు. పోలింగ్ సమయంలో అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఛేదిస్తూ యువత ముందుకెళ్లాలన్నారు.
'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో పర్యటించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. తొలిసారి సాలూరుకు విచ్చేసిన సందర్భంగా నారా భువనేశ్వరికి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట
సాలూరుకు చేరుకున్న ఆమె తొలుత స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీలక్ష్మి గణపతి, శ్రీ నగరేశ్వరస్వామి, కన్యకాపరమేశ్వరి, శ్రీ జనార్ధన స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ప్రత్యేక పూజల అనంతరం భువనేశ్వరికి తీర్ధ ప్రసాదాలు అందచేశారు.
అక్కడి నుంచి ఇప్పిలి వీధికి చేరుకుని, ట్రస్టు సీఈవో రాజేంద్రప్రసాద్‌తో కలసి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన సంజీవని ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన సేవ కార్యక్రమాలను భువనేశ్వరి వివరించారు.
ఏపీలో ప్రాణహాని ఉంది - రక్షణ కల్పించండి: తెలంగాణ సీఎంకు దస్తగిరి విజ్ఞప్తి
నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించారని, ఆయన స్ఫూర్తితో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌ను స్థాపించినట్లు ఆమె తెలిపారు. ఈ ట్రస్ట్ స్థాపించి గత 27 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 12,095 ఆరోగ్య శిబిరాల ద్వారా 19.74 లక్షల మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలతో పాటు రూ. 20 కోట్ల విలువైన మందులను ఉచితంగా అందించినట్లు తెలిపారు.
కరోనా సమయంలో కోటిన్నర రూపాయలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పాఠశాలను నడుపుతూ 1,238 మంది విద్యార్థులకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలను అందించినట్లు తెలిపారు. దీంతోపాటు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఇప్పటి వరకు 3.44 కోట్ల ఉపకార వేతనాలు అందించామని భువనేశ్వరి పేర్కొన్నారు.
హనుమ విహారి కెప్టెన్సీ తొలగింపు దుమారం - వైసీపీ సర్కారుపై విపక్షాల ముప్పేట దాడి