Manda Krishna Madiga Support to NDA : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆయన నివాసంలో కలిశారు. ఏపీలో పరిణామాలు, రాజకీయాలపై చర్చించారు. మందకృష్ణ మాదిగ ఇప్పటికే బీజేపీకి మద్దతిచ్చారు. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం చేరడంతో ఏపీలో కూటమికి మద్దతివ్వాలని నిర్ణయించికున్నట్లు తెలిపారు. మాదిగల అభ్యున్నతికి 35అంశాలతో చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చారు.
TDP Leaders Came to Chandrababu Naidu Residence : నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఆశావాహులతో సందడి నెలకొంది. ఆఖరి జాబితాలో చోటు దక్కించుకునేందుకు ఆశావాహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజుకు అవకాశం కల్పించాలని మందకృష్ణ మాదిగ చంద్రబాబు నివాసానికి వచ్చారు. గుంటూరు పశ్చిమ తెలుగుదేశం నేత డేగల ప్రభాకర్‌ను తీసుకొని గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అధినేత వద్దకు వచ్చారు. విజయనగరం పార్లమెంట్ కోసం కంది చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి చంద్రబాబును కలిశారు. భీమిలి టికెట్ కోసం ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
జగన్ దళిత ద్రోహి- దళితులందరూ గట్టిగా బుద్ధి చెప్పాలి : మందకృష్ణ మాదిగ
TDP Candidates Third List : తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ 145 స్థానాల్లో పోటీ చేస్తుంది. అందులో భాగంగా తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు రెండో జాబితాలో 34మందిని ఖరారు చేశారు. పొత్తుల లెక్క ప్రకారం మరో 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతో ఆశావాహులు చంద్రబాబు నివాసానికి బారులు తీరారు.
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుకు మద్దతు : చంద్రబాబు నాయుడుకు మాదిగల ఆకాంక్షలను, సమస్యలను వివరించాను మాదిగల అభ్యున్నతికి 35 అంశాలతో చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చాను. ప్రతీ దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుకు మద్దతు తెలుపుతున్నాం. అలాగే ఎన్డీఏ కూటమి గెలుపుకు ఎంఆర్పీఎస్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ