MP Kesineni Sivanath Fire on Jagan Batch False Allegations : విజయవాడ వైఎస్సార్సీపీ పేటీఎం బ్యాచ్ మొత్తం వరద సాయంపై బురద చల్లేందుకు ఒక చోట చేరారని ఎంపీ కేశినేని శివనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ డ్రామా బ్యాచ్ చేసే విన్యాసాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ఏనాడూ నిజం చెప్పని ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. 2019-24మధ్య ప్రజల్ని ఎన్నో విధాలా మోసం చేసిన చరిత్ర వైఎస్సార్సీపీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓ బ్లూ మీడియాను నడుపుతూ మళ్లీ బ్లూ పుస్తకం రాస్తామనటం విడ్డూరమని దుయ్యబట్టారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జల్సాలకు గత 5 ఏళ్లలో రూ. 4877 కోట్లు ఖర్చు పెట్టారని కేశినేని శివనాథ్ ఆరోపించారు. ఎగ్ పఫ్‌లకే రూ. 3 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. వరదల సమయంలో ప్రజా తిరుగుబాటు చూసి జగన్ 10 నిమిషాలు కూడా వారి మధ్య ఉండలేక పోయాడని ఆక్షేపించారు. వరద బాధితులకు జగన్ ప్రకటించిన కోటి రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వరద విపత్తును మరిచి ప్రజలు దసరా పండుగ ఆనందంగా జరుపుకుంటుంటే ఓర్వలేకే వైఎస్సార్సీపీ నేతలు ధర్నాలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Narayana Comments on Sakshi: వరద సాయంపై ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేకే వైఎస్సార్సీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని తప్పు దోవ పట్టించేలా వరదల్లో బురద రాజకీయం చేయటం వైఎస్సార్సీపీ నేతలకే చెల్లిందని మండిపడ్డారు. వరద సాయంపై రాసిన అబద్ధాలనే పదేపదే సాక్షి ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. విజయవాడకు అంత పెద్ద వరద విపత్తు వచ్చి తగ్గాక కనీసం 2-3 వేల మందైనా ఆసుపత్రిల్లో అంటువ్యాధులు ప్రబలి చేరాలి కానీ ఎక్కడా అంటువ్యాధులు ప్రబల లేదంటే ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణమని వెల్లడించారు.
ఎగ్ పఫ్‌లకే రూ.3.5 కోట్లు మింగేసిన జగన్ - వరద సాయం వైఎస్సార్సీపీ ముఠా ఫేక్ ప్రచారం : పట్టాభి
వరద సాయంపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమా? : మంత్రులు