MLC and YSRCP Leader sensational comments on CM Jagan and YSRCP: బీసీలకు సరైన న్యాయం చేస్తామంటూ డబ్బాలు కొటుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవన్నీ ఉత్తమాటలేనని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ప్రతిపక్షాలు, సొంత పార్టీలోని ఒకరిద్దరు నేతలు ఆరోపిస్తే అదేదో విమర్శ అనుకోవచ్చు. కానీ, తాజాగా బీసీ సెల్ అధ్యక్షుడే బీసీలకు న్యాయం జరగడం లేదని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ జగన్ పాలనలో బీసీలకు పదవులిచ్చారే గానీ అధికారాలు లేవని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్పై జంగా కృష్ణమూర్తి చేసిన విమర్శల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జగన్ చెప్పే సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. ఎస్సీ, బీసీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కనీసం ప్రొటోకాల్ పాటించటం లేదని, వారికి కనీస గౌరవం లేదనేది ప్రజలు చూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
వైఎస్సార్సీపీలో మరో వికెట్ - పార్టీకి ఎంపీ సంజీవ్ కుమార్ గుడ్ బై
Janga Krishnamurthy Slams CM Jagan: లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారని, కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేదన్నారు. కీలకమైన పదవులన్నీ ఒకే వర్గం చేతిలో ఉన్నాయని దీంతో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగటం లేదని వ్యాఖ్యానించారు. బీసీ వర్గాల వారు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ ఎక్కువైందని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలోని జనాభాలో అధిక శాతమున్న బీసీలకు సరైన న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. నా ఎస్ఠీ, నా ఎస్సీ, నా బీసీలని మాట్లాడుతున్నారే తప్ప వారి మనోభావాలను జగన్ అర్థం చేసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. బీసీలకు తాత్కలికంగా కొన్ని పదవులు ఇచ్చి, వారికి సామాజిక న్యాయం చేసేశామని, బీసీలు సమాజంలో మెరుగుపడిపోయారన్నట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిక - తర్వాత చెబుతానంటూ దాటవేత
బీసీలు మెరుగుపడిపోయారు అనే మాట నిజం కాదని ఆయన తేల్చి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సామాజిక న్యాయం అసలు సామాజిక న్యాయమే కాదని, నేతి బీరకాయలోని నెయ్యి ఎంత నిజమో, జగన్ మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అంతే నిజమని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని బీసీ కులాలన్ని జగన్ మోహన్ రెడ్డిని నమ్మినప్పటికీ వారికి సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పవర్ లేనటువంటి పదవులే బీసీలకు కట్టబెట్టారని అన్నారు. రాష్ట్రంలోని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటిలోని చైర్మన్లలో ఏ ఒక్కర్ని కూడా ఇప్పటివరకూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసిన పరిస్థితి లేదని అన్నారు. అసలు కార్పొరేషన్లకు నిధులే లేవని మండిపడ్డారు. సామాన్యులు, బడుగూ బలహీన వర్గాలు, విదేశీ విద్యను అభ్యసిందేందుకు వీలైన సహాయాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించలేకపోయిందని దుయ్యబట్టారు.
ఇష్టం లేకపోయినా మనసు చంపుకుని పని చేస్తున్నా - వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
బీసీలు అనేక అవమానాలకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది బీసీ నాయకులు వైఎస్సార్సీపీ దూరం అవుతున్నారని వివరించారు. వారికి వైఎస్సార్సీలో సరైన గౌరవం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా స్వేచ్ఛ, అధికారాలు లేవని జంగా కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ పునరాలోచించుకోవాలని కోరారు.
తేలుకుట్టిన దొంగలా దాక్కున్న విజయసాయిరెడ్డి - విచారణకు హాజరైతే బండారం బట్టబయలు : టీడీపీ