ETV Bharat / politics

సీఎం క్యాంపు కార్యాలయానికి చేరిన నగరి వర్గపోరు - జగన్​కు రోజా ఫిర్యాదు - Roja Complained to CM Jagan

Minister Roja Complained to CM Jagan about Dissident Leaders : మంత్రి రోజా నియోజకవర్గమైన నగరిలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. గత కొంత కాలంగా రోజాపై నగరి వైసీపీ నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారం తాడేపల్లి సీఎం కార్యాలయానికి చేరింది. సీఎం జగన్​ను కలిసిన రోజా అసమ్మతి నేతలపై ఫర్యాదు చేశారు.

minister_roja
minister_roja
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 7:26 PM IST

Minister Roja Complained to CM Jagan about Dissident Leaders : ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి రోజాపై (Minister Roja) వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతోంది. నియోజకవర్గ పరిధిలోని మండలాలతో పాటు నగరి, పుత్తూరు నేతలు రోజాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోజాను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నేతలు బహిరంగ విమర్శలు చేయడంతో పాటు రోజా ప్రమేయం లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జరగబోయే ఎన్నికలలో రోజాకు టికెట్​ ఇస్తే ఓడించడం ఖాయమని నియోజకవర్గ వైసీపీ నేతలు అధిష్టానాన్ని హెచ్చరించారు. నగరిలో రోజాకి తప్ప ఇంకెవరికి సీటు కేటాయించినా గెలిపిస్తామని నేతలు అంటున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయి ఐరన్ లెగ్‌గా ముద్రపడిన రోజాను తమ కష్టంతో రెండుసార్లు గెలిపించామని ఇంక రోజాను గెలిపించేది లేదని హెచ్చరించారు.

ఓటర్లకు వైఎస్సార్సీపీ ఎర - ఉపాధ్యాయినులకు మంత్రి రోజా తాయిలాలు

తాడేపల్లికి చేరిన నగరి వ్యవహారం: అయితే ఈ వ్యవహారం తాడేపల్లికి చేరింది. సీఎం కార్యాలయానికి (Chief minister Camp Office) మంత్రి రోజా సీఎం జగన్​ను కలిసి అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేశారు. ఈ మధ్య నగరిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అసమ్మతి నేతలు రోజాపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. రోజాకు సీటిస్తే తప్పనిసరిగా ఓడిస్తామని అసమ్మతి నేతలు అల్టిమేటం జారీ చేయగా ఈ విషయమై మంత్రి రోజా సీఎం జగన్​ను కలిసి అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేశారు.

జగన్ పాలనలో రైతులకు అష్టకష్టాలు- నగరిలో మంత్రి రోజా గ్రావెల్, ఇసుక దోపిడి వైఎస్ షర్మిల

మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని మోసం: పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి 40 లక్షల రూపాయలు తీసుకుని మంత్రి రోజా మోసం చేశారని గతంలో వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. మున్సిపల్ ఎలక్షన్స్​లో 17వ వార్డు నుంచి దళిత మహిళ అయిన తాను ఎకగ్రీవంగా ఎన్నికైనట్లు భువనేశ్వరి తెలిపారు. తనకు చైర్మన్ పదవి ఇస్తామని మూడు విడతలుగా రూ.40 లక్షల తీసుకున్నారని చెప్పి దానికి సంబంధించిన వీడియోని ఆమె బయటపెట్టారు. డబ్బులు తీసుకున్నాక పదవి మాత్రం ఇవ్వలేదని డబ్బులు అడిగితే సమాధానం చెప్పకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగనే తనకు న్యాయం చేయాలని భువనేశ్వరి కోరారు.

మమ్మల్నే అడ్డుకుంటావా- మంత్రికి చెప్పి నీపై చర్యలు తీసుకుంటాం! పోలీసుతో మంత్రి అనుచరుడి వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.