Minister Parthasarathy and MLA Sirisha Apologize: గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ ఇచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఆదివారం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జోగి రమేష్‌ను ఎవరు పిలిచారంటూ టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యక్రమంలో పాల్గొన్న పార్థసారథి, శిరీష వివరణ ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. విగ్రహావిష్కరణలో జోగి రమేష్ పాల్గొనడంపై తమ ప్రమేయం లేదని ఇరువురు క్షమాపణలు తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.
ఎల్లవేళలా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తా: లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొంటారని తనకు ముందే తెలియదని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అలా తెలిసి ఉంటే తాను హాజరయ్యే వాడిని కాదని చెప్పారు. తనని అభిమానించే టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. అలానే అధినేత చంద్రబాబుకి కూడా క్షమాపణ తెలిపారు. పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమాలు తాను ఏ రోజూ చేయనని స్పష్టం చేశారు. ఎల్లవేళలా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని అలానే చంద్రబాబు, లోకేశ్ నాయకత్వం బలపడేందుకు పని చేస్తానని చెప్పారు.
తెలియకపోవడం వల్లే పొరపాటు జరిగింది: చంద్రబాబు కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తెలిసి తాను ఏ తప్పూ చేయలేదని ఎమ్మేల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. నూజివీడులో తన తాత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉందని నెల రోజుల క్రితమే గౌడ సంఘం పిలిచిందని, కానీ అక్కడకు ఎవరెవరు వస్తున్నారో ముందుగా తనకు తెలియకపోవడం పొరపాటు జరిగిందని చెప్పారు. సోషల్ మీడియాలో ఏ చర్చ జరిగినా అధిష్టానం దృష్టికి తానే తీసుకెళ్తానని చెప్పారు. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉందని శిరీష స్పష్టం చేశారు. ఈ సారి ఏవరైనా పిలిస్తే ఏవరేవరిని పిలిచారో తెలుసుకునే వెళ్తానని చెప్పారు.
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ - నాగబాబు గురించి చర్చ!
'పోలవరం పూర్తయ్యేది అప్పుడే - టార్గెట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు