Minister Narayana Clarity On Hydra Demolition in AP : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Minister Narayana on Illegal Construction in AP : ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో దుర్వాసన లేదని, అదే విధానంపై అధ్యయనం చేసి ఇక్కడా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. గత వైఎస్సార్సీపీ హయాంలో మున్సిపల్ శాఖతో పాటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, గత ఐదు సంవత్సరాల్లో ఒక్క మంత్రి కూడా ఈ ప్లాంట్‌కు రాలేదని ఆరోపించారు. అక్టోబర్ నాటికి మున్సిపల్ శాఖను గాడిన పెడతామని అన్నారు.
2023లో రూ.450 కోట్ల నిధులు వస్తే వాటినీ పక్కదారి పట్టించారని విమర్శించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ఆ డబ్బు మున్సిపల్ శాఖకు ఇచ్చారని అన్నారు. స్వచ్ఛ భారత్‌లో 295 కోట్లు రావాలని, మాచింగ్ గ్రాంట్ 120 కోట్లు ఇవ్వకపోవడంతో నిధులు రాలేదని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని వచ్చేలా చేశారని తెలిపారు. వచ్చే నెల నాటికి టీడీఆర్ కుంభకోణాలపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. సెప్టెంబర్ 13న మరో 75 క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వంలో పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారని, అక్రమ నిర్మాణాలను వదులుకోవాలని పిలుపునిస్తున్నామని, నిర్మాణాలు వదులుకోకపోతే మేమే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఆక్రమించి నిర్మించిన భవనాల్లో కొన్నింటిని ఇప్పటికే కూలగొట్టామని మంత్రి తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో టౌన్ ప్లానింగ్ అధ్వానంగా మారిందని, మాస్టర్‌ప్లాన్‌పై కమిటీ వేసి, నిపుణులతో అధ్యయనం చేయిస్తామని అన్నారు. మాస్టర్‌ప్లాన్‌పై సమగ్ర నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
వైఎస్సార్సీపీ అక్రమ నిర్మాణాలు - కూల్చివేసిన సీఆర్డీఏ అధికారులు - YSRCP Office Demolished
విశాఖలో పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేశారని గంటా శ్రీనివాసరావు అన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే తెలంగాణలోని హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందని హెచ్చిరించారు. శాఖ కాపులుప్పాడ డంపింగ్ యార్డ్, ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటును మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పరిశీలించి అక్కడ మొక్క నాటారు.
హైదరాబాద్‌లో హైడ్రా హడల్ - అక్రమ నిర్మాణాలపై ముప్పేట దాడి - HYDRA DEMOLITIONS