ETV Bharat / politics

పారిపోతున్న YSRCP నేత, కుప్పం పోలీసుల అదుపులో నాగార్జున యాదవ్‌ - Nagarjuna yadav arrested

YSRCP నేత నాగార్జున యాదవ్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. రాత్రి బెంగళూరు పారిపోతున్న నాగార్జునను ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో కుప్పం పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కుప్పం స్టేషన్‌ పరిధిలో నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా నాగార్జనను ప్రశ్నిస్తున్నారు.

కుప్పం పోలీసుస్టేషన్‌లో నాగార్జున యాదవ్‌
కుప్పం పోలీసుస్టేషన్‌లో నాగార్జున యాదవ్‌ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 12:14 PM IST

Nagarjuna yadav arrested: టెలివిజన్‌ చర్చా వేదికల్లో, సోషల్‌ మీడియాలో నోటి దురుసు ప్రవర్తన చూపే YSRCP నేత నాగార్జున యాదవ్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పరుష పదజాలంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనా నాగార్జున ఇష్టానుసారం నోరు జారారు. నాగార్జున యాదవ్‌ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు పోలీసుస్టేషన్‌ల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా నాగార్జున యాదవ్‌ కనింపించకుండా తిరుగుతున్నారు. రాత్రి గుట్టుచప్పుడు కాకుండా గుంటూరు నుంచి బెంగళూరు బస్సులో వెళ్తున్న ఆయన్ను కుప్పం పోలీసులు అదుపులో తీసుకున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో అదుపులో తీసుకున్న పోలీసులు కప్పం స్టేషన్‌కు తరలించారు.

కుప్పం పోలీసుస్టేషన్‌లో నాగార్జున యాదవ్‌
కుప్పం పోలీసుస్టేషన్‌లో నాగార్జున యాదవ్‌ (ETV Bharat)

కుప్పం స్టేషన్‌ పరిధిలోనూ నాగార్జునపై ప్రజాప్రతినిధులను దూషించిన కేసు నమోదైంది. ఈ కేసు విషయమై వివరాలు రాబట్టేందుకు కప్పం పోలీసులు నాగార్జనను అదుపులో తీసుకున్నారు. బంగారుపాలెం వద్ద గుంటూరు బస్సును తనిఖీ చేసి పోలీసులు నాగార్జనను అదుపులో తీసుకున్నారు. చిత్తూరుకు చెందిన వరుణ్‌కుమార్‌ అనే తెలుగుదేశం కార్యకర్త ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్యంగా దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వరుణ్‌కుమార్‌ ఫిర్యాదు ఆధారంగా నాగార్జునపై కుప్పం పోలీసు స్టేషన్‌లో FIR నమోదు చేశారు. పోలీసులు రాతంత్రా నాగార్జును తమదైన శైలిలో విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. బెంగళూరు పారిపోతున్న క్రమంలో ఆయన్ను అదుపులో తీసుకున్నామని కుప్పం పోలీసులు తెలిపారు. నాగార్జున నుంచి పలు ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానాలు రాయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.