ETV Bharat / politics

చంద్రబాబు, పవన్​ కల్యాణ్​కు శుభాకాంక్షల వెల్లువ- ఎన్టీఆర్, మహేశ్​, కల్యాణ్​ రామ్ ట్వీట్స్ చూశారా? - Junior NTR on AP Election Results

Junior NTR Reacts on AP Election Results: కూటమి విజయంపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చంద్రబాబు, పవన్​ను అభినందిస్తూ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ట్వీట్లు చేశారు.

Junior_NTR_and_Kalyan_Ram_Reacts_on_AP_Election_Results
Junior_NTR_and_Kalyan_Ram_Reacts_on_AP_Election_Results (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 3:59 PM IST

Updated : Jun 5, 2024, 7:43 PM IST

Junior NTR Reacts on AP Election Results: ఏపీలో మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులు ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించారు. ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు అనేకమంది మంగళవారం నుంచే అభినందనలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయదుందుభి మోగించిన చంద్రబాబు, పవన్​ కల్యాణ్​ను అభినందిస్తూ విషెస్ తెలుపుతున్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నేడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రియమైన మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చంద్రబాబుకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. చంద్రబాబు విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

పిఠాపురంలో పవన్ గెలుపు- పేరు మార్పుపై స్పందించిన ముద్రగడ - Mudragada Reacts on His Name Change

అలాగే అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేశ్, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణకు, ఎంపీలుగా గెలిచిన భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు ఇంతటి ఘన విజయం సాధించిన పవన్​ కల్యాణ్​కు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తారక్ ఎక్స్​లో ట్వీట్ చేశారు. కూటమి విజయం పట్ల ఎన్టీఆర్ స్పందించడంతో తెలుగుదేశం అభిమానులు, జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు నందమూరి కల్యాణ్ రామ్ కూడా చంద్రబాబు విజయంపై స్పందించారు. చంద్రబాబు కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ ట్వీట్ చేశారు. చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబుకు, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

చంద్రబాబు రాక చారిత్రక అవసరం!- ఏపీ ప్రజల తీర్పు ఏకపక్షం - AP Needs CBN

సూపర్ స్టార్ మహేశ్​బాబు సైతం ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ సీఎం కాబోతున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటు పవన్ కల్యాణ్​కు కూడా ఆయన విషెస్ తెలిపారు. ప్రజలు పవన్​పై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి ఆయన విజయమే ప్రతిబింబం అని పేర్కొన్నారు. ప్రజల కలలను సాకారం చేయడంలో పవన్ తన పూర్తి పదవీకాలంతో పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను అంటూ మహేశ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : Jun 5, 2024, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.