ETV Bharat / politics

జగన్‌ అసెంబ్లీకి రారని పందేలు నడుస్తున్నాయి - 10మంది ఎమ్మెల్యేలూ సహకరించట్లేదు : అనిత

కొన్ని పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయన్న హోం మంత్రి అనిత

Minister Anitha Fires on Jagan
Minister Anitha Fires on Jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 7:20 PM IST

Minister Anitha Fires on Jagan : వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి అసెంబ్లీకి రారని రూ.11కు పందేలు నడుస్తున్నాయని హోం మంత్రి అనిత వ్యంగ్యాాస్త్రాలు సంధించారు. రఘురామ స్పీకర్‌ స్థానంలో కూర్చుంటే ఆయన శాసనసభకి రారని కూడా బెట్టింగ్​లు నడుస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ జగన్ తాడేపల్లి నివాసంలో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్నా కోరం కూడా లేదని తెలిసిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్​కి సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు.

కొన్ని పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయి : మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరని అనిత చెప్పారు. సొంత తల్లిని, చెల్లిని తిట్టినవారిని మీరేం చేయలేకపోయారని జగన్​ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. వారిని తాము అరెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి వారికి తమరు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. కొన్ని పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయని అనిత పేర్కొన్నారు.

"జడ్జిలు, వారి కుటుంబసభ్యులను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వాళ్లు పెట్టిన పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఇలాంటి పోస్టులు పెట్టినవారిని ఏం చేయాలో ప్రజలే చెప్పాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనేకమంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. మీరు ఎక్కడికి వెళ్లినా మేం అడ్డుకోవడం లేదు. వీరిని ఇలాగే వదిలేస్తే రేపు మీ ఇంట్లోని ఆడపిల్లలపైనా పోస్టులు పెడతారు." - అనిత, హోం మంత్రి

మరోవైపు సోషల్ మీడియా పోస్టులపై వైఎస్సార్సీపీ నేతలు మానవ హక్కుల కమిషన్​ని ఆశ్రయించడం విడ్డూరమని అనిత మండిపడ్డారు. సభ్య సమాజంలో వర్రా రవీందర్​రెడ్డి, బోరుగడ్డ అనిల్, ఇంటూరి రవి లాంటి వాళ్లు తిరగడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ఎంతవరకు అవసరమో ప్రజలే ఆలోచించాలని పేర్కొన్నారు. ప్రజాధనంతో నడిచే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అసభ్య పోస్టులు పెట్టించిన సజ్జల భార్గవ్​రెడ్డి, అవినాష్ రెడ్డిని కాపాడాలని ఎన్​హెచ్​ఆర్సీని ఆశ్రయించారా అని అనిత ప్రశ్నించారు.

'క్షమించరాని పోస్టులతో తప్పు చేసిన అలాంటి వెనకేసుకొస్తున్న వైఎస్సార్సీపీ నేతల్ని ఏమనాలి. నేరంలో భాగస్వామ్యం ఉందన్నట్లు వైవీ సుబ్బారెడ్డి చొరవ తీసుకున్నారా? రాజకీయ ముసుగు తీసి ప్రజల ముందు నిలబెట్టే ప్రభుత్వం మాది. పుంగనూరు, తిరుపతిలో బాలికల ఆత్మగౌరవం దెబ్బతినే ప్రకటనలపై చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లలపై నోటికొచ్చినట్లు మాట్లాడేవారిపై కేసులు పెడుతూనే ఉంటాం. ప్రత్యేక చట్టం తేవడంపైనా మా ప్రభుత్వం ఆలోచిస్తోంది.' అని అనిత వ్యాఖ్యానించారు.

AP Assembly Sessions 2024 : వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మాట్లాడని నేతలు ఇప్పుడు మండలిలో గందరగోళం సృష్టిస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. జగన్ లా ఉత్తుత్తి బటన్లు నొక్కి మోసం చేసే ప్రభుత్వం తమది కాదన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతీ రూపాయి ఖర్చు చేసి చూపిస్తామని వెల్లడించారు. మండలి చీఫ్ విప్ అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేశ్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని వొమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అనురాధ చెప్పారు.

పెండింగ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తాం - రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తి : లోకేశ్

20 మంది విప్​లు - అన్ని వర్గాలకు సముచిత న్యాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.