ETV Bharat / politics

ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి - హైకోర్టులో జగన్ పిటిషన్ - Jagan Petition in AP High Court - JAGAN PETITION IN AP HIGH COURT

YS Jagan Petition in AP High Court For Opposition Leader: ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్‍ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని, లేఖ రాసినా ఇవ్వలేదని పేర్కొన్నారు.

Former CM  YS Jagan Petition in AP High Court For Opposition Leader
Former CM YS Jagan Petition in AP High Court For Opposition Leader (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 5:20 PM IST

Updated : Jul 23, 2024, 5:39 PM IST

Former CM YS Jagan Petition in AP High Court For Opposition Leader : ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 'పట్టు వదలని విక్రమార్కుడిలా' పోరాటం చేస్తున్నారు. గతంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని, లేఖ రాసినా ఇవ్వలేదని జగన్ పిటిషన్‍లో పేర్కొన్నారు.

YS JAGAN LETTER TO ASSEMBLY SPEAKER : జగన్‌ శాసనసభ చింతకాయల అయ్యన్న పాత్రుడుకి జూన్ 25న లేఖ రాశారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం సంప్రదాయాలకు విరుద్ధమని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని లేఖలో తెలిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు.

స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ- ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని విజ్ఞప్తి - YS JAGAN LETTER TO ASSEMBLY SPEAKER

పార్లమెంటులోకాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో గానీ ఈ నిబంధన పాటించలేదన్నారు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు.

జగన్‌కు ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలోనూ రాదు : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి - Minister Anam Comments On Jagan

Minister Payyavula Keshav Reacts Jagan Letter about Opposition Status : జగన్‌ ప్రతిపక్ష నేత కాదని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్‌కు ఆప్తుడైన కేసీఆర్‌ కూడా గతంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్పీకర్​కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ కేవలం మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాకుండా శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్‌ అండ్‌ షఖ్దర్‌ పుస్తకం, అసెంబ్లీ రూల్‌ బుక్‌ చదవాలని సూచించారు. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా అని ఆయన ఎద్దేవా చేశారు.

జగన్‌ ప్రతిపక్ష నాయకుడు కాదు - ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే: మంత్రి పయ్యావుల కేశవ్‌ - Payyavula Reacts over Jagan letter

Last Updated : Jul 23, 2024, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.