ETV Bharat / politics

ఎన్నికల దగ్గరపడుతున్న కొద్ది జోరుగా తెలుగుదేశంలోకి వైసీపీ నేతల చేరికలు - TDP to YCP

YCP leaders joining TDP: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. నిన్నా మెన్నటి వరకూ వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడగా, తాజాగా వైసీపీ నేతలకు కుడి భుజంగా ఉన్న నేతలు సైతం ఆ పార్టీని వీడుతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులకు సన్నితులుగా ఉన్న నేతలు పార్టీలో తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆరోపిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 10:09 PM IST

YCP leaders joining TDP: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గోపవరం వెంకటరమణమ్మ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్, మరియు కౌన్సిలర్లు రమాదేవి గారు, వేణు గారు, సూర భాస్కర్ రెడ్డి గారు, కొత్తపల్లి రమేష్ , తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు చంద్రారెడ్డి, చల్లా రవి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగం వదులుకొని గ్రామాభివృద్ధి కోసం వైసీపీలో చేరి ప్రకాశ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే వీధిలైట్లు కూడా వేయించుకోలేకపోయామని ఉప మండలాక్షుడు సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండల వైసీపీ ఉప ఎంపీపీ సంపత్ కుమార్, వైసీపీ నాయకుడు రామాంజనేయులుతో పాటు 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి పరిటాల సునీత సమక్షంలో వెంకటాపురంలో టీడీపీలోకి వచ్చిన వైసీపీ నాయకులకు ఆమె టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉప ఎంపీపీ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఉన్నతంగా చదువుకొని, ఉద్యోగం వదిలి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోటానికి వైసీపీలో చేరానన్నారు. తాము కష్టపడి ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని గెలిపించుకుంటే, గ్రామంలో వీధిలైట్లు కూడా వేయించుకోలేక పోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని పరిస్థితితో వైసీపీ ను వీడి టీడీపీలో చేరినట్లు చెప్పారు.

జోరుగా కూటమి నేతల ప్రచారాలు- అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా చేరికలు - Election Campaign Full Swing in AP

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కలుగోట్లలో 60 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీకి తొలి నుంచీ కష్టపడిన తనకు మంత్రి అప్పలరాజు కనీస గౌరవం ఇవ్వలేదని శ్రీకాకుళం జిల్లా పలాస వైసీపీ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ ఆరోపించారు. అందుకే వైసీపీకి రాజీనామా చేసినట్లు దువ్వాడ శ్రీకాంత్ తెలిపారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఏలూరు జిల్లా కైకలూరులో వైసీపీ ఎదురుదెబ్బ తగిలింది. కైకలూరు జడ్పీటీసీ సభ్యురాలు కూరేళ్ల బేబీ వైసీపీకి పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ జిల్లా క్రిస్టియన్ సెల్ కార్యదర్శి ప్యాట్రిక్ పాల్ సైతం పార్టీకి రాజీనామా చేశారు. కైకలూరు కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకోగా, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వైఎస్సార్సీపీకి గుడ్​బై- రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేనలో భారీగా చేరికలు - YCP JOINed JSP AND TDP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.