EX CM Jagan Fire on Government : పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల రషీద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. రషీద్ కుటుంబ సభ్యులను వివిధ నాటకీయం పరిణామాల నుడుమ వైఎస్సార్సీపీ అధినేత జగన్ పరామర్శించారు. జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో పోలీసులు భారీగా మోహరించారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతి భద్రతలు ఏమీ బాగోలేవు : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై వచ్చే బుధవారం దిల్లీలో ధర్నా చేస్తామని జగన్ చెప్పారు. గత నెల రోజులు నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ బాగోలేవని, రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి అపాయింట్‌మెంట్లు అడుగుతున్నామని తెలిపారు. అపాయింట్‌మెంట్ ఇస్తే రాష్ట్రంలోని శాంతి భద్రతల గురించి వివరిస్తామని వెల్లడించారు.
ఫేక్ పాలిటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ జగన్ - ధ్వజమెత్తిన టీడీపీ శ్రేణులు - jagan fake publicity
హామీలన్నీ అమలు చేయాలని నిలదీస్తాం : విద్యా దీవెన, వసతి దీవెన ఫీజుల చెల్లింపు ఆలస్యం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అమ్మ ఒడి నిధులను ఏటా జూన్‌లో వేశా వాళ్లమని, రైతు భరోసా నిధులను క్రమం తప్పకుండా వేశామని, తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లులను మోసం చేశారని అన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.1500 హామీ ఏమైందని, రైతులకు పెట్టుబడి సాయం రూ.20వేల హామీ ఏమైందని ప్రశ్నించారు. హామీలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు.
ఆ దారుణ హత్యకు కారణాలు ఏంటి? - వెలుగులోకి విస్తుపోయే విషయాలు - Reasons for Vinukonda Murder
పల్నాడులో యువకుడు దారుణ హత్య - సంఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ - Young Man Murder