ETV Bharat / politics

ఏలూరు వైఎస్సార్సీపీకి భారీ షాక్- మేయర్ సహా ప్రముఖులంతా టీడీపీలో చేరిక - Eluru Mayor join in TDP - ELURU MAYOR JOIN IN TDP

Eluru Mayor join in TDP : ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరిందరికీ లోకేశ్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

eluru_mayor_join_in_tdp
eluru_mayor_join_in_tdp (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 5:52 PM IST

Eluru Mayor join in TDP : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో ఆ పార్టీ భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు నేతలు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరిందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల్లో ఓటమి నుంచి వైఎస్సార్సీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.

అన్న క్యాంటీన్లపై సైకో జగన్ బ్యాచ్​ విష ప్రచారం : నారా లోకేశ్​ - Tanuku Anna Canteen Issue

ఏలూరులో వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు నేతలు సైకిలెక్కారు. ఉండవల్లి నివాసంలో వీరిందరికీ లోకేశ్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల్లో ఓటమి నుంచి వైఎస్సార్సీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.

ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చేవారికి స్నేహహస్తం అందిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఆళ్ల నాని వైఎస్సార్సీపీ కార్యకర్తలను వదిలేసి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని తెలుగుదేశం లో చేర్చుకుంటున్నామని వెల్లడించారు. త్వరలోనే దశల వారీగా కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరబోతున్నారని పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం వీడి వైఎస్సార్సీపీలోకి వెళ్లామని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ అన్నారు. ఆ పార్టీలోకి వెళ్లాక ఏమాత్రం అభివృద్ధి చేయలేక పోయామన్నారు. దాదాపు 40మంది కార్పొరేటర్లు త్వరలోనే తెలుగుదేశం లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

'నా గొంతుపై కత్తి పెట్టి భూమి కబ్జా చేశారు' - ప్రజాదర్బార్​లో లోకేశ్​కు బాధితుడి మొర - Nara Lokesh Praja Darbar

'టీడీపీ శ్రేణుల సహనాన్ని పరీక్షించొద్దు - శ్రీను హత్య వెనక ఎవరున్నా వదిలిపెట్టం' - TDP Leader Srinu Murder in Kurnool

ఏలూరు వైఎస్సార్సీపీకి భారీ షాక్- మేయర్ సహా ప్రముఖులంతా టీడీపీలో చేరిక (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.