ETV Bharat / politics

యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు - చూసీచూడనట్లు ఉంటున్న అధికారులు - YSRCP Election Code Violations - YSRCP ELECTION CODE VIOLATIONS

Election Code Violations by YSRCP Leaders: వైసీపీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి వారం దాటినా అధికారులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ తరఫు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఓటేయ్యాలని ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అయినా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

election_code_violations
election_code_violations
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 10:41 PM IST

Election Code Violations by YSRCP Leaders: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నా కొన్నిచోట్ల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ రంగులను తొలగించకుండా చోద్యం చూస్తున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘానికి చెందిన 9 ఆటోలకు రెండేళ్ల క్రితం వైసీపీ జెండా రంగులు వేశారు. రంగులు కనిపించకుండా అధికారులు చర్యలు తీసుకోకపోగా చెత్త సేకరణ చేస్తున్నారు. ఈ ఆటోలపై ఉన్న వైసీపీ రంగులు మున్సిపల్ అధికారికి కనిపించడం లేదా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఓ వైపు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు - మరోవైపు ఫిర్యాదు చేసినవారిపై దాడులు - violating election code by YSRCP

Srikakulam District: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం జగన్నాథపురంలో మంత్రి అప్పలరాజు ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించగా అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, డ్వాక్రా సభ్యులు పాల్గొన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు మండిపడ్డారు. మందస మండలం తాళ్లగురంటిలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఉపాధి క్షేత్ర సహాయకుడు లోకనాథం చౌదరి పాల్గొని ప్రచారం చేశారు. ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Bapatla District: బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్లలో వాటర్ ట్యాంకర్‌కు వైసీపీ రంగులు వేశారు. ఈసీ ఆదేశాలను లెక్కచేయకుండా పరిమళ ఫౌండేషన్ నిర్వాహకులు వైసీపీ రంగులతో కూడిన ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు.

ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడ్ ఉల్లంఘనలు- దేవాలయాలనూ వదలని వైసీపీ నేతలు - Volunteers Election Code Violation

Anantapur District: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో చాలా చోట్ల సీఎం జగన్, అధికార పార్టీ బొమ్మలు, రాతలు అధికార పార్టీల రంగులు అలానే కనిపిస్తున్నాయి. ఉరవకొండ మండలం రాయంపల్లిలో నీటి ట్యాంకుపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన రాతలు ఉన్నా... అధికారులు వాటిని తొలగించలేదు. విడపనకల్లు మండలం డోనేకల్లు గ్రామ సచివాలయంపై సీఎం జగన్ బొమ్మను అలాగే ఉంచారు. హావళిగిలో నూతన గ్రామ సచివాలయం ఆర్బీకే నిర్మాణాల వద్ద ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన బోర్డులపై జగన్ చిత్రాన్ని అలాగే వదిలేశారు. వీటిన్నింటిని అధికార యంత్రాంగం చూస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఎన్నికల నియమావళి అమల్లో ఉందా? అన్న చర్చ గ్రామాల్లో నడుస్తోంది.

సత్యసాయి జిల్లాలో దారుణం- వేట కొడవళ్లతో టీడీపీ కార్యకర్త హత్య - TDP Worker Murder Case

Prakasam District: ఎన్నికల కోడ్​ను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బొగ్గులగొంది కాలనీలో శిలాఫలకానికి ఎటువంటి మాస్కులు వేయకుండా అలాగే వదిలేశారు. స్థానిక సబ్ స్టేషన్ వద్ద శిలాఫలానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో కూడా శిలాఫలకానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నియోజకవర్గంలో ఎన్నికల కోడ్​ను పగడ్భందీగా అమలు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు - చూసీచూడనట్లు ఉంటున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.