ETV Bharat / politics

"మేమున్నాం" అంటూ విరాళాల వెల్లువ - వారందరికీ లోకేశ్ కృతజ్ఞతలు - Donations to help flood victims

Help Flood Victims : వరద బాధితుల సహాయార్థం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాతల నుంచి విరాళాలు, చెక్కులు మంత్రి నారా లోకేశ్​కు అందచేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందచేసిన తెలుగు సినీ ప్రముఖులకు మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

help_flood_victims
help_flood_victims (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 5:36 PM IST

Help Flood Victims : వరద బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాతల నుంచి విరాళాలు, చెక్కులు మంత్రి నారా లోకేశ్​కు అందజేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కళ్లం రాజశేఖర్ రెడ్డి రూ.10 లక్షలు, కొమ్మారెడ్డి కిరణ్ రూ.10 లక్షలు విరాళం అందించారు. వీరితో పాటు ఏ.వీ రమణారెడ్డి రూ.7 లక్షలు, ఒంగోలుకు చెందిన మేదరమెట్ల సుబ్బయ్య లక్ష రూపాయలు, ఆలూరు కొండలరావ్ రూ.50 వేలు, ఆలూరి ఝాన్సీలక్ష్మి రూ.50 వేల చొప్పున విరాళం అందజేశారు.

వాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీ, న్యూ రాజీవ్ నగర్ ప్రాంతాల్లో వరద బాధితుల కోసం ఉదయం నుంచి హెలీకాప్టర్ల ద్వారా 42 వేల కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు, పండ్లు జారవిడిచారు. వరద సహాయ చర్యలపై మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్​లతో లోకేశ్ సమన్వయం చేస్తున్నారు.

వరద బాధితులను ఆదుకోవడమే లక్ష్యం- ఆపద సమయంలో కుట్రలా? : చంద్రబాబు - CM review flood relief measures

జూనియర్ ఎన్టీఆర్​తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందచేసిన తెలుగు సినీ ప్రముఖులకు మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో తోచిన విధంగా చేసే సాయం ప్రజల్ని కాపాడేందుకు ఎంతో ఉపకరిస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయం కోసం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. "తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు చాలా మందిని బలి తీసుకున్నాయని, ఎంతో మందిని నిస్సహాయుల్ని చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో సర్వం కోల్పోయిన అందరికీ ఈ కష్టసమయంలో ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. నా బాధ్యతగా తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షలు చొప్పున మొత్తం కోటి రూపాయలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నాను" అంటూ బాలకృష్ణ ప్రకటించారు.

రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ అసోయేషన్‌ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లతో కూడి ఈ అసోయేషన్‌ అధ్యక్షుడు ధర్మచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి విశ్వేరనాయుడు తదితరులు అసోయేషన్‌ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.

పెద్ద మనసు చాటుకున్న సీనీ హీరోలు - వరద సాయం ఎవరెంత ఇచ్చారంటే! - Tollywood donates to flood victims

ఏవరూ భయపడొద్దు - అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రజలకు మంత్రుల భరోసా - Ministers Visit Flooded Areas

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.