ETV Bharat / politics

టీడీపీ-జనసేన Vs వైఎస్సార్సీపీ మేనిఫెస్టో - ప్రజల స్పందన ఎలా ఉందంటే - NDA Manifesto VS YsrCP Manifesto - NDA MANIFESTO VS YSRCP MANIFESTO

NDA Manifesto Vs YSRCP Manifesto: తెలుగుదేశం-జనసేన మేనిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల వైఎస్సార్సీపీ అరాచక పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని గాడిన పెట్టేలా అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యమిస్తూ తెలుగుదేశం-జనసేన విడుదల చేసిన మ్యానిఫెస్టోకి విశేష స్పందన లభిస్తోంది. ఈ మ్యానిఫెస్టో ఎన్డీయే నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపగా వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టోపై ఆ పార్టీ వాళ్లే పెదవివిరుస్తున్నారు. రెండు మ్యానిఫెస్టోలనూ పోలిస్తే వైసీపీది తేలిపోయిందన్న భావన వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 10:27 AM IST

టీడీపీ-జనసేన Vs వైఎస్సార్సీపీ మేనిఫెస్టో - ప్రజల స్పందన ఎలా ఉందంటే

NDA Manifesto Vs YSRCP Manifesto : మహిళలు మహిళా లోకానికి టీడీపీ-జనసే ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చారు. 19 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15 వేలు ఇస్తామన్నారు. అంటే ఒక తల్లికి ఎంత మంది పిల్లలుంటే అందరికీ 15 వేలు చొప్పున అందిస్తామని చెప్పారు. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నారు.

మహిళా ఉద్యోగులకు వసతి సదుపాయం ఉంటుందన్నారు. అదే సమయంలో వైసీపీ మ్యానిఫెస్టోలో 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా 18 వేల750 రూపాయిలు ఇస్తామన్నారు. కాపు, ఈబీసీ మహిళలకు ఏటా 15 వేలు ఇస్తామన్నారు. పిల్లల్ని బడికి పంపించే తల్లికి అందునా ఒక్క బిడ్డకు మాత్రమే ఏటా 17 వేలు ఇస్తామన్నారు. ఇందులో పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధి పేరిట 2 వేలు మినహాయించుకుంటామన్నారు. డ్వాక్రా సంఘాలకు 3 లక్షల వరకూ వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు.

సామాజిక పింఛన్లు : పింఛన్ల విషయంలో టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటన విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే నెలకు 4 వేల పింఛను ఇస్తామని ప్రకటించారు. అంటే ఏప్రిల్, మే, జూన్ బకాయిలు కలిపి ఒకేసారి 7 వేలు చెల్లిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు రూ. 6 వేలు ఇస్తామన్నారు. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక రోగులకు రూ. 10 వేలు ఉంటుందన్నారు.

వైసీపీ మ్యానిఫెస్టో పింఛన్ల విషయం తేలిపోయింది. రూ. 3 వేలే ఇస్తామని కొత్తగా ఏమీ పెరగదని ప్రకటించారు. 2028 జనవరి నుంచి నెలకు రూ. 3 వేల 250, 2029 జనవరి నుంచి రూ. 3 వేల 500 చెల్లిస్తామన్నారు. దివ్యాంగులకూ ఇదే పరిస్థితి. దీర్ఘకాలిక రోగులకు రూ. 10 వేలు ఇస్తామన్నారు.

పాత మేనిఫెస్టోకు కొత్త రంగులద్దిన వైఎస్సార్సీపీ- డ్వాక్రా, రైతు రుణాల మాఫీ ఊసేదీ! - Andhra Pradesh Elections 2024

గృహనిర్మాణం : గృహనిర్మాణం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చింది. ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల నివాస స్థలం ఇస్తామన్నారు. ఇప్పటికే నివాస స్థలం మంజూరైనా పట్టాలు పొందనివారికి ప్రభుత్వం తరఫున పక్కా ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు.

వైసీపీ మ్యానిఫెస్టోలో అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి పట్టణాల్లో ఒక సెంటు నివాస స్థలం, గ్రామాల్లో సెంటున్నర ఇస్తామన్నారు. గత ఐదేళ్లలో అసంపూర్తిగా మిగిలిపోయిన 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మధ్య తరగతి కోసం దశలవారీగా పట్టణాల్లో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణానికి పావలా వడ్డీకే 35 వేల రుణం, ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే నిర్మాణ సామగ్రి ఇస్తామన్నారు.

మత్స్యకారుల సంక్షేమం : మత్స్యకారుల సంక్షేమం టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20 వేల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో 217 రద్దు చేస్తామన్నారు. బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్‌కు ఆర్థిక సాయం ఉంటుందన్నారు.

వైసీపీ మ్యానిఫెస్టోలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ. 10 వేలు మాత్రమే ఆర్థిక సాయం ఉంటుందన్నారు.

డ్రైవర్ల సంక్షేమం : డ్రైవర్ల సంక్షేమం టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో బ్యాడ్జ్‌ కలిగిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్‌ కలిగిన లారీ, టిప్పర్‌ డ్రైవర్లకు ఏటా రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించారు. డ్రైవర్లను యజమానులను చేసే లక్ష్యంతో వాహనాల కొనుగోలుకు 5శాతంవడ్డీతో4 లక్షల రుణం ప్రకటించారు. అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద, ఆరోగ్య బీమా ఉంటుందన్నారు. డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. డ్రైవర్ల పిల్లలకు విద్యా రుణాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు జీవో 21 రద్దు చేసి, జరిమానాల భారం తగ్గింపు ఉంటుందన్నారు. వాహనాలపై పెంచిన హరిత పన్ను తగ్గిస్తామన్నారు.

వైసీపీ మేనిఫెస్టో ఆటో, ట్యాక్సీ, సొంత టిప్పరు/లారీ నడిపే వారికి ఏడాదికి రూ. 10 వేలే ఇస్తామన్నారు. ఆటో, ట్యాక్సీ, లారీ కొనుగోలు కోసం 6 శాతం వడ్డీతో 3 లక్షల వరకు రుణ సాయం చేస్తామన్నారు. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా చేస్తామన్నారు. ఆరోగ్య బీమా ప్రస్తావన లేదన్నారు.

'పన్ను బాదుడు లేని సంక్షేమం – ప్రతి ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యం' - నేడు ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో - NDA MANIFESTO 2024

చేనేత కార్మికుల సంక్షేమం : చేనేత కార్మికుల సంక్షేమం టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 24 వేల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తిరిగి చెల్లిస్తామన్నారు. పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు.

వైసీపీ మ్యానిఫెస్టోలో మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి మాత్రమే ఏటా రూ. 24 వేలు ఇస్తామన్నారు.

యువత – ఉపాధి : యువత – ఉపాధి టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందన్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఉంటాయన్నారు. నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఉంటుందన్నారు.

వైసీపీ మ్యానిఫెస్టోలో క్రమం తప్పకుండా గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో 175 స్కిల్‌ హబ్‌లు, 26 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తామన్నారు. వాటిలో నైపుణ్య శిక్షణ పొందేవారికి పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌గా నెలకు అబ్బాయిలకు 2వేల500, అమ్మాయిలకు 3 వేలు ఇస్తామన్నారు. విశాఖపట్నంలో స్టార్టప్‌ హబ్‌ పెడతామన్నారు.

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ : విద్యార్థులు టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఎయిడెడ్‌ కళాశాలలు, ప్రైవేట్‌ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పునరుద్ధరణ ఉంటుందన్నారు. కాలేజీలకే రుసుము చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్‌ చిక్కులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడటానికి కారణమైన జీవో 117 రద్దు చేస్తామన్నారు. మూతపడిన పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తామన్నారు. డాక్డర్‌ అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం పునరుద్ధరిస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామన్నారు. ఐదేళ్లకోసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్ల అమలు చేస్తామన్నారు.

వైసీపీ మ్యానిఫెస్టోలో ప్రభుత్వ బడుల్లో ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్‌లుగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉంటారన్నారు. వారికి నెలకు 12 వేలు స్టైపెండ్, క్రెడిట్‌లు ఇస్తామన్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. కోర్టు కేసులను అధిగమించి 18 విశ్వవిద్యాలయాల్లో 3 వేల 295 అధ్యాపక పోస్టుల భర్తీ చేస్తామన్నారు. విదేశీ విద్యా దీవెన, నాడు-నేడు, 8వ తరగతి విద్యార్థులకు ఏటా ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపు ఉంటుందన్నారు.

రైతులు : రైతులు ప్రతి రైతుకు ఏటా 20 వేల చొప్పున ఐదేళ్లలో లక్ష ఆర్థిక సాయం చేస్తామని టీడీపీ-జనసేన మేనిఫెస్టోలో ప్రకటించారు. రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా ఉంటుందని ప్రకటించారు. రైతు కూలీలకు కార్పొరేషన్‌ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాల అమలు చేస్తామన్నారు. బిందు సేద్యానికి 90 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. గోపాలమిత్రల పునర్నియామకం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని జోన్లలో ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ రూయిన్నరకే సరఫరా చేస్తామన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ధరల తగ్గింపు, సబ్సిడీపై ఏరియేటర్లు ఇస్తామన్నారు.

వైసీపీ మ్యానిఫెస్టోలో రైతుభరోసా కింద ఏటా 16 వేల చొప్పున ఇస్తామన్నారు. ఐదేళ్లలో80 వేలు ఇస్తామన్నారు. గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల కొనసాగింపు ఉంటుందన్నారు.

వైద్యం- ఆరోగ్య, ప్రమాద బీమా : వైద్యం- ఆరోగ్య, ప్రమాద బీమా ఈ విషయాల్లో టీడీపీ జనసేన మేనిఫెస్టో చాలా కీలక హామీలు ఇచ్చింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ఉంటుందన్నారు. సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల బీమా ఇస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధ కేంద్రాల ఏర్పాటు చేస్తామని బీపీ, షుగర్‌ వంటి ఆరోగ్య సమస్యలకు ఉచితంగా జనరిక్‌ మందులు ఇస్తామన్నారు.

వైసీపీ మ్యానిఫెస్టోలో ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యం ఉంటుందన్నారు. సహజ మరణానికి లక్ష, ప్రమాదవశాత్తూ మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా 5 లక్షల సాయం ఇస్తామన్నారు. గిగ్‌ వర్కర్స్‌కు 5 లక్షల ప్రమాద బీమా ఉంటుందన్నారు. హృద్రోగ బాధితులకు విశాఖ, గుంటూరు, కర్నూలుల్లో వైద్య హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య ఆసరా, నాడు-నేడు సహా గత ఐదేళ్లలో అమలు చేసిన కార్యక్రమాలు, పథకాల కొనసాగింపు ఉంటుందన్నారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం : ఎస్సీ, ఎస్టీ సంక్షేమం టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో జిల్లాల వారీగా వర్గీకరణ అమలు ఉంటుందన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. ఏజెన్సీల్లో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో 3 పునరుద్ధరిస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. డాక్టర్‌ సుధాకర్, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం, మంత్రూ బాయ్, డాక్టర్‌ అచ్చెన్న తదితరుల హత్యకు కారకులైన వారికి కోర్టుల్లో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేస్తామన్నారు.

వైసీపీ మేనిఫెస్టోలో పెద్దగాహామీలు ఏమీ ఇవ్వలేదు. మొత్తం జనాభాలో కనీసం 50 శాతం దళితులు లేదా దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని మాత్రమే ప్రకటించారు.

బీసీ సంక్షేమం : బీసీ సంక్షేమం టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామని ప్రకటించారు. బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్ల ఖర్చు చేస్తామన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. స్వయం ఉపాధికి ఐదేళ్లలో 10 వేల కోట్ల ఖర్చు చేస్తామన్నారు. 5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామన్నారు. తోట చంద్రయ్య, అమర్నాథ్‌గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసిన వైసీపీ గూండాలకు శిక్ష పడేలా చర్యలు ఉంటాయన్నారు. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం కేటాయింపు ఉంటుందన్నారు. క్వారీల్లో వడ్డెరలకు 15 శాతం రిజర్వేషన్‌ రాయల్టీ, సీనరేజ్‌ల్లో మినహాయింపు ఉంటుందన్నారు. స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు నెలకు 25 వేల గౌరవ వేతనం ఇస్తామన్నారు. సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు.

వైసీపీ మ్యానిఫెస్టోలో సొంత దుకాణాలున్న నాయీబ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా 10 వేల చొప్పున సాయం చేస్తామన్నారు. కులవృత్తిదారులు, చిరువ్యాపారులకు 15 వేలు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. సక్రమంగా చెల్లించే వారికి ఐదేళ్లలో 20 వేలకు పెంపు ఉంటుందన్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు నెలకు 20 వేల గౌరవ వేతనం, సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కొనసాగింపు ఉంటుందన్నారు. సామాజిక భవనాల నిర్మాణానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు.

ముస్లిం మైనార్టీల సంక్షేమం : ముస్లిం మైనార్టీల సంక్షేమం టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇమామ్‌లకు ప్రతి నెలా 10 వేలు, మౌజన్‌లకు 5 వేల గౌరవవేతనం ఇస్తామన్నారు. విజయవాడ సమీపంలో హజ్‌హౌస్‌ నిర్మాణం చేస్తామన్నారు. నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఏటా 100 కోట్ల కేటాయింపు ఉంటుందన్నారు. మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. మసీదు నిర్వహణకు ప్రతి నెలా 5 వేల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. హజ్‌ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు లక్ష సహాయం చేస్తామన్నారు.

వైకాపా మ్యానిఫెస్టో ఇమామ్‌లకు ప్రతి నెలా 10 వేలు, మౌజన్‌లకు 5 వేల గౌరవవేతనం కొనసాగిస్తామన్నారు. ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు.

99 శాతం హామీలు ఎలా పూర్తయ్యాయి జగన్? - ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? - YSRCP Fake Manifesto

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.