ETV Bharat / politics

జగన్​ బొమ్మ తొలగించాలని మంత్రి మండలి నిర్ణయం - నూతన ఎక్సైజ్ విధానంపై చర్చ - CABINET MEETING DECISIONS - CABINET MEETING DECISIONS

Cabinet Meeting : సీఎం అధ్యక్షతన జరిగిన క్యాబినెట్​ సమావేశంలో జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వేరాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చ జరిగింది. బొమ్మల పిచ్చితో నాటి సీఎం రూ.700 కోట్లు వాడేశారని మంత్రులు పేర్కొన్నారు. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి క్యాబినెట్​ ఆమోదం తెలిపింది.

cabinet_meeting
cabinet_meeting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 3:07 PM IST

Cabinet Meeting : రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. సర్వే రాళ్లపై మాజీ సీఎం జగన్​ బొమ్మ తొలగించడంతో పాటు రాజముద్ర కలిగిన పట్టాదార్​ పాస్​పుస్తకాల పంపిణీకి ఆమోదం లభించింది. ఎక్సైజ్​ విధానంలో అక్రమాలకు తావులేకుండా మార్పులు చేర్పులపై మంత్రి వర్గంలో చర్చించారు.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం మంత్రి మండలి సమావేశం జరిగింది. మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించాలని పలువురు మంత్రులు సూచించారు. బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్లు రూపాయలు తగలేశారని మంత్రులు తెలిపారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరూ తొలగించడానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి కెబినెట్ నిర్ణయం తీసుకున్నది. జగన్ బొమ్మలతో ఉన్న పాసు పుస్తకాలను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్​ భేటీ - ఏడు అంశాలపై చర్చ - AP Cabinet Meeting Today

రీ-సర్వేపై రెవెన్యూ శాఖ కెబినెట్లో నోట్ సమర్పించింది. రీ-సర్వే వల్ల తలెత్తిన వివాదాలపై చర్చించారు. గత ప్రభుత్వ విధానం వల్ల రీ-సర్వేపై భూ యజమానుల్లో ఆందోళన ఉందని మంత్రులు వ్యాఖ్యానించారు. భూ యజమానుల్లో ఆందోళన ఉంటే గ్రామాల్లో వివాదాలు పెరుగుతాయని కేబినెట్ ఆభిప్రాయపడింది. రీ-సర్వే ప్రక్రియను అబేయెన్సులో పెట్టాలని కెబినెట్ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేసేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మావోయిస్టులపై మరో ఏడాది పాటు నిషేధం విధించేలా కేబినెట్ తీర్మానం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లోని అబ్కారీ విధానం, గత టీడీపీ హయాంలో చేపట్టిన మధ్య విధానం పై కేబినెట్ లో చర్చించారు. ఎక్సైజ్ విధానం ఆదాయం కోసం కాకుండా అక్రమాలకు తావు లేకుండా మార్పు చేర్పుల పై మంత్రివర్గంలో చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన 217 జీవో రద్దు చేస్తూ మంత్రి వర్గం తీర్మానం చేసింది.

పోలవరంపై కేబినెట్​లో చర్చ- నిధులన్నీ కేంద్రమే ఇవ్వాలని తీర్మానం - Polavaram Project Funds

చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి- మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం - Chandrababu Direction to Ministers

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.