ETV Bharat / politics

డబ్బు, అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారు- జగన్​ సమాజానికి ప్రమాదం: తులసిరెడ్డి - TULASI REDDY

జగన్​కు తల్లి లేదు, చెల్లి లేదు, నాన్నలేడు, చిన్నాన్న లేడు,హితులు లేరు, సన్నిహితులు లేరని, ఉన్నదల్లా స్వార్థమేన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి - వైఎస్సార్సీపీ నేతల తీరుపై ఆగ్రహం

Congress Leader Tulasi Reddy Fire on YSRCP Leaders
Congress Leader Tulasi Reddy Fire on YSRCP Leaders (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 5:19 PM IST

Congress Leader Tulasi Reddy Fire on YSRCP Leaders : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి డబ్బు పిచ్చి, అధికార పిచ్చి ఉన్నాయని, వాటికోసం ఎంతకైనా దిగజారుతాడని, ఏ దుర్మార్గానికైనా పాల్పడుతాడని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఆస్తికోసం నవమాసాలు మోసిన కన్న తల్లి మీదనే కోర్టు కెక్కాడని, ఎంతటి దూర్మార్గానికైనా పాల్పాడుతాడు అనేందుకు ఇది ఒక మచ్చు తునకని అన్నారు. జగన్​కు తల్లి లేదు, చెల్లి లేదు, నాన్నలేడు, చిన్నాన్న లేడు,హితులు లేరు, సన్నిహితులు లేరని, ఉన్నదల్లా స్వార్థమే. అణువణువునా స్వార్థమే అని వెల్లడించారు. జగన్ సమాజానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, ప్రజలు ఆలోచించాలన్నారు.

చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మరికొందరు వైఎస్సార్సీపీ నాయకులు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని, దుర్మార్గమని తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఒక వటవృక్షం అని, దానికి ఊడలు జగన్, చంద్రబాబు లాటి వాళ్ళు అని అన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్, నేతాజీ, ఇందిరమ్మ, సోనియమ్మ లాంటి ప్రపంచ స్థాయి నాయకులు నాయకత్వం వహించిన పార్టీ కాంగ్రెస్ అని, అటువంటి గొప్ప పార్టీకి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్టులు చదివే అలవాటు వైఎస్సార్సీపీకి ఉందని అన్నారు. బీజేపీ చేతిలో టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేనలు కీలుబొమ్మలని ఎద్దేవా చేశారు.

ఐదేళ్లు మీరు గాడిదలు కాశారా ? చార్జిషీట్​లో వైఎస్ పేరు చేర్పించింది జగన్ కాదా?-విజయసాయి రెడ్డికి షర్మిలా కౌంటర్

రాజశేఖర్ రెడ్డి మరణం కుట్ర పూరితం, దీనికి కారణం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని అని వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి, రిలయన్స్ ఆస్తుల మీద, పెట్రోల్, డీజల్ బంకుల మీద దాడులు చేసి విధ్వంసం సృష్టించారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ ముఖేష్ అంబానీకి ఘన స్వాగతం పలికి, పసందైన విందు భోజనం పెట్టి ముఖేష్ అంబానీ సిఫారసు చేసిన పారిశ్రామిక వేత్త పరిమళ్ నత్వానీకి రాజ్య సభ సీటు ఇచ్చాడని ఆరోపించారు. జగన్ ఎంతటి ఆపద్ధమైన సులభంగా చెప్పగలడని అన్నారు.

ఏపీలో బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అని అందరికీ తెలుసని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు పసలేని మాటలు మాట్లాడవద్దని సూచించారు. ఆకాశం మీద ఉమ్మి వేస్తే తిరిగి వేసిన వారి ముఖం మీద పడుతుందని వైఎస్సార్సీపీ నాయకులు తెలుసుకుంటే మంచిదిని హితువు పలికారు.

15 ఏళ్లు అయినా పరిశ్రమ స్థాపించలేదు- సరస్వతీ భూములను స్వాధీనం చేసుకోవాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.