ETV Bharat / politics

'సజ్జల, ఆయన కుటుంబం నా భూమి కబ్జా చేసింది' - మంత్రి కందులకు బాధితుడు ఫిర్యాదు - Complaint to Durgesh on Sajjala - COMPLAINT TO DURGESH ON SAJJALA

Complaint to Kandula Durgesh on Sajjala Land Irregularities: జనసేన చేపట్టిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వైఎస్సార్​సీపీ నాయకుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేశ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి తన భుములను కబ్జా చేశారని కడప జిల్లాకు చెందిన వ్యక్తి మంత్రి​కి ఫిర్యాదు చేశారు.

complaint_to_durgesh_on_sajjala
complaint_to_durgesh_on_sajjala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 10:33 PM IST

Complaint to Kandula Durgesh on Sajjala Land Irregularities: గత ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల, ఆయన కుటుంబ సభ్యులు తన భూమిని కబ్జా చేశారంటూ కడప జిల్లా చింతకొమ్మదిన్నెకు చెందిన బుక్కే రాజానాయక్ అనే వ్యక్తి మంత్రి కందుల దుర్గేశ్​కు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేశ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి చెందిన 300 ఎకరాల ఎస్టేట్​లో తన 5 ఎకరాల భూమిని బలవంతంగా కలుపుకున్నారని రాజా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఆ భూమికి డీకేటీ పట్టా ఇచ్చిందని చెప్పారు. తనకు న్యాయం చేయాలని అధికారులకు ఫిర్యాదు చేస్తే దానిని వదులుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని వాపోయారు.

స్పందనలో 7 సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని తనకు సహాయం చేయాలని మంత్రికి విన్నవించారు. వెంటనే మంత్రి కడప జిల్లా కలెక్టర్​తో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. రాజమండ్రిలోని వైఎస్సార్​సీపీ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి తన భూమిని లాక్కొని వేరొకరికి అమ్మేశారని తనకు న్యాయం చేయాలని మంత్రికి వినతి పత్రం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని బాధితులు వాపోయారు. తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రత పేరుతో ఆయన నివాసానికి సమీపంలో ఉన్న ఇళ్లను తొలగించి ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ ఇంటి స్థలం చూపించలేదని శ్రీనివాసరావు అనే వ్యక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు బలైపోయాం - న్యాయం చేయండి - జనసేన కార్యాలయానికి క్యూ కట్టిన బాధితులు - YSRCP VICTIMS IN JANASENA Office

200 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో: వైఎస్సార్​సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి జీవో లేకుండానే టూరిస్ట్‌ పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌లను ఏర్పాటు చేశారని, వాటిని నిర్మించిన తనకు ఇప్పటివరకూ బిల్లులు ఇవ్వలేదని విశాఖ జిల్లాకు చెందిన షణ్ముఖ పవన్‌ అనే గుత్తేదారు వాపోయారు. అప్పటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి చెప్పారని విశాఖతోపాటు పలు పర్యాటక ప్రదేశాల్లో ఈ అవుట్‌ పోస్టులను నిర్మించానని తెలిపారు. వీటి నిర్వహణకు అప్పటి సీఎం జగన్‌ బటన్‌ నొక్కి విడుదల చేసిన 200 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్‌ కార్యక్రమంలో సెర్ప్, ఎంఎస్‌ఎంఈ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

దౌర్జన్యంగా ఖాళీ స్టాంపులపై సంతకాలు: తన పొలాన్ని వైఎస్సార్​సీపీ అధినేత జగన్‌కు బాడీగార్డుగా పనిచేస్తున్న నేలపూడి సురేష్‌ కబ్జా చేశారని ఏలూరు జిల్లా కలిదిండి మండలం నరసింహపురం గ్రామానికి చెందిన అంకాల భోగేశ్వరరావు 2022లో తనపై దౌర్జన్యం చేసి ఖాళీ స్టాంపు కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. దళితులకు 1987లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇప్పటికీ తమ పేర్లపై ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని రాజంపేటకు చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. సమస్యలు విన్న మంత్రి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు.

'ఒకప్పుడు హీరో అడవులను కాపాడే వాడు- కానీ ఇప్పుడు అడవుల్లో స్మగ్లింగ్​ చేస్తున్నాడు' - Pawan Kalyan comments Movies

'వైఎస్సార్సీపీ నాయకులు ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేశారు' - జనసేన నేతలకు బాధితుల ఫిర్యాదు - YSRCP Victims at Janasena Program

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.