CM Jagan Met With YSRCP Leaders: వైసీపీలో పార్లమెంట్,అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జీల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ చార్జీల మార్పులతో ఐదో జాబితాను సీఎం జగన్ రూపొందిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తప్పిస్తోన్న జగన్ మరికొందరిపైనా వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం గత కొన్ని రోజులుగా జగన్ కసరత్తు చేస్తున్నారు. టికెట్ తమకే ఇవ్వాలని కొంత మంది సట్టింగ్ ఎమ్మెల్యేలు తాడేపల్లి సీఎంవోకి వచ్చి విన్నవించుకుంటున్నారు. ఈ సారి ఎంత మందిపై వేటు పడుతుందోనని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.
జొన్నలగడ్డ పద్మావతికి సీఎంఓ పిలుపు - జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
Change of Incharges in YSRCP: ఇన్ఛార్జీల మార్పులో భాగంగా సీఎం జగన్ ఇప్పటికే 4 జాబితాల్లో 59 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల అభ్యర్థులను మార్చేశారు. మరికొన్ని కీలక స్థానాల్లోనూ ప్రస్తుతం ఉన్న వారిని తీసివేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జీలు మార్పులతో అయిదో జాబితా సీఎం జగన్ రూపొందిస్తున్నారు. తాడేపల్లి నుంచి కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది.
బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగకుండా - జగన్ బంతాటలో బలవుతున్న నేతలు
MLAs and MPs Going to Tadepalli: నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ తాడేపల్లికి పిలిపించారు. పిలుపు మేరకు చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, విశాఖ ఎమ్మెల్యే వాసూపల్లి గణేష్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబురి శంకర్రావు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సీఎం క్యాంప్ ఆఫీస్‌కి వచ్చారు. సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. ఆయా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీల మార్పులపై ధనుంజయరెడ్డి, సజ్జల చర్చించారు. ఇతరులను కాకుండా తమకే తిరిగి టికెట్ ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కోరారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని (Vijayawada MP Kesineni Nani) కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి మంతనాలు జరిపారు.
మళ్లీ అవే అబద్ధాలు చెప్పిన జగన్ - మొత్తం ప్రసంగంలో అదొక్కటే నిజం
Class War in YSRCP: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుల వల్ల వర్గ విభేదాలు భగ్గుముంటున్నాయి. నాయకుల తీరు నచ్చట్లేదని కొంత మంది, కొత్త ఇన్ఛార్జీలు వద్దని మరికొంత మంది నాయకులు, కార్యకర్తలు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మేము నాయకుల కోసం కష్టపడి పని చేశామని కాని కొత్తగా వచ్చే వారి దగ్గర ఉండాలంటే కష్టంగా ఉంటుందని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో కొత్త వారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని తేల్చి చెప్తున్నారు. కొంత మంది నాయకులు వైసీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక పార్టీని వీడి వేరే పార్టీలో చేరుతున్నారు.