ETV Bharat / politics

'అయ్‌ బాబోయ్‌ చాలా గొప్పోరండి మీరు' - జగన్‌ అభ్యర్థుల పరిచయ వ్యాఖ్యలతో జనం నవ్వులు - Public Satires on YSRCP Candidates

Jagan Introduced YSRCP MLA Candidates: ఎమ్మెల్యేలుగా వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే తమ ప్రతాపం చూపించారు! నియోజకవర్గాల్లో అనేక సమస్యలున్నా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయినా మళ్లీ వారినే అభ్యర్థులుగా పోటీలో నిలపడమే కాకుండా సౌమ్యులు, జెంటిల్మన్‌ మంచివాడు అంటూ వెళ్లిన ప్రతిచోట జగన్‌ పొగడటాన్ని చూసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. వీళ్లందరూ సౌమ్యులట, మంచివాళ్లట చెప్పినోడికి లేకపోతే వినే వాళ్లం మనకైనా కాస్త మంచీ చెడూ ఉండొద్దూ అంటూ వెటకారంగా మాడ్లాడుకుంటున్నారు.

Jagan Introduced YSRCP MLA Candidates
Jagan Introduced YSRCP MLA Candidates
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 6:49 AM IST

'అయ్‌బాబోయ్‌ చాలా గొప్పోరండి మీరు' - జగన్‌ అభ్యర్థుల పరిచయ వ్యాఖ్యలతో జనం నవ్వులు

Jagan Introduced YSRCP MLA Candidates : మమకారం పంచే గోదావరి జిల్లాలు వెటకారానికీ పెట్టింది పేరు. 'అయ్‌బాబోయ్‌ చాలా గొప్పోరండి మీరు' అంటే అందులో చాలా వెటకారం ధ్వనిస్తుంది. ఆ పొగడ్తలోనే తెగడ్త కూడా మిళితమై ఉంటుంది. ఇది నరనరాన వంట పట్టించుకున్న ఆ ప్రాంతంలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేస్తూ వారిని పొగిడిన తీరులో స్థానికులకు వెటకారం కూడా కనిపించింది..

గ్రంధి శ్రీనివాస్‌ : భీమవరం ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ఏకంగా లోకల్‌ హీరో అని పొగిడేశారు. భీమవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో సాగిన అనేక వ్యవహారాలను ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆయన హీరోనా అని ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఊళ్లో గొడవ జరిగింది. కొందరు అల్లర్లు సృష్టించారు. అయినా తిరిగి టీడీపీ వారిపైనే కేసులు పెట్టారు. 70 ఏళ్లు దాటిన ఒక మహిళా నాయకురాలు అక్కడికి వచ్చి రాళ్లు వేసినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవిడ రాళ్లు వేయడం ఏమిటని నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది.

ఈ 'సౌమ్యుడు' నాయకత్వం వహించిన నియోజకవర్గంలోనే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక చోట జనసేన గెలిస్తే అధికార పార్టీ వారు కర్రలు, రాడ్లతో దాడికి వెళ్లింది కూడా ఈ సౌమ్యుడి పాలనలోనే. అలాగే ఇక్కడ సెటిల్‌మెంట్ల ఆరోపణలు ఉన్నాయి. కొందరిపై రౌడీషీట్లు మాయమైపోయిన ఉదంతాలూ ఉన్నాయి. అంతే కాదు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ భీమవరంలో ఇల్లు కట్టుకుందామనుకుంటే భయపడి ఎవరూ భూమి అమ్మేందుకు ముందుకు రాలేదు. అలాంటి చోట గ్రంధి శ్రీనివాస్‌లో ముఖ్యమంత్రి జగన్‌కు మంచితనం ఏమాటున కనిపించిందో అంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు.

వీళ్లందరూ మంచోళ్లైతే - ఇన్నాళ్లు జనాన్ని ముంచిందేవరో చెప్తారా జగన్ గారు! - YSRCP MLA Candidates

కొట్టు సత్యనారాయణ : నిజానికి తాడేపల్లిగూడెంలో ఇల్లు కట్టుకోవడమే కష్టమైన పరిస్థితిని అయిదేళ్లుగా ఇక్కడి ప్రజలు చూస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు. రియల్‌ ఎస్టేట్‌ పూర్తిగా మందగించింది. ఇందుకు కారణాలు ఈ సౌమ్యుడైన కొట్టు సత్యనారాయణకు తెలిసినా చక్కదిద్దలేదు. అయినా కొట్టు ప్రజలందరికీ మంచి చేస్తాడు అని జగన్‌ ప్రకటించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏం జరిగిందో తలచుకుని జనం అవాక్కవుతున్నారు. ఇక్కడ జరిగిన టీడీఆర్‌ బాండ్ల కుంభకోణమూ చర్చనీయాంశమవుతోంది. ప్రజాధనం కోట్లలో ఇక్కడ దుర్వినియోగమైంది. ఇందుకు బాధ్యులు ఎవరో కొట్టు సత్యనారాయణకు తెలియదా అని జనం ప్రశ్నిస్తున్నారు.

ఏంటీ వీళ్లు మంచోళ్లా? - ఒకసారి ఈ అరాచకాలు చూద్దామా జగన్? - CM Jagan Lies about YCP Candidates

ప్రసాదరాజు : నరసాపురం నియోజకవర్గంలో ఎసైన్డ్‌, డీపట్టా, జిరాయితీ భూములపై కొందరి కన్ను పడింది. రైతులను భయపెట్టి కొందరు చాలా తక్కువ ధరకు 200 ఎకరాలను కొనిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని క్రమబద్ధీకరించేందుకు కొందరు ప్రభుత్వ యంత్రాంగంపైనా ఒత్తిడి తెచ్చారు. నియోజకవర్గంలో ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నా ఏ మాత్రం తొణకని, బెణకని మంచివాడు . అందరికీ మంచిచేసే అలాంటి ప్రసాదరాజుని జగన్‌ పొగడటాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు . కొవిడ్‌ సమయంలో రోగులకు, పేదలకు భోజనాలు, సేవా కార్యక్రమాల పేరుతో ఇక్కడ కొందరు పెద్ద దందా చేశారు. భారీగా విరాళాలు వసూలు చేసి ఎలాంటి కార్యక్రమాలూ చేయలేదు. ఇలాంటివి అనేకం సాగుతున్నా ఆయన ఏ మాత్రం పట్టించుకోనంత ‘మంచి’ చేసేవాడు ప్రసాదరాజు అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

కారుమూరి వెంకట నాగేశ్వరరావు : ఇక ఈయనైతే రైతులను ఎర్రిపప్పలు అనేంత సౌమ్యుడు. అలాంటి కారుమూరి మనసు వెన్న అని ముఖ్యమంత్రి కితాబు ఇవ్వడం విశేషం. తణుకులో జరిగిన వందల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఎందరికో నష్టం కలిగించింది. తణుకు ప్రజాప్రతినిధిగా అప్రమత్తమై ఇలాంటివి నిరోధించాల్సింది పోయి ఇతరత్రా విమర్శలు మూటగట్టుకున్నారు. అంతే కాదు మొదటి నుంచి ఆయనతో ఉన్న పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కారుమూరి వ్యవహారశైలి నచ్చక దూరమయ్యారు. అలాంటి నాయకుడి మనసు వెన్న అని జగన్‌ కితాబివ్వడం ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది..

వందల కోట్ల ఆస్తులు - వైసీపీ అభ్యర్థులు పేదవాళ్లే - జనం చెవిలో జగన్​ పువ్వులు - Jagan Lies About Candidates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.