ETV Bharat / politics

తిరుగుబాటు చేయండి - అండగా ఉంటా - చంద్రబాబు హామీ - CM CHANDRABABU ON YS JAGAN

రాజకీయ ముసుగులో తప్పుచేసిన వారిని ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు - క్యాడర్ నుంచి వస్తున్న విమర్శలు అర్థం చేసుకోగలనని వ్యాఖ్య

CM_Chandrababu_Naidu
CM Chandrababu Naidu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2024, 3:09 PM IST

Updated : Oct 26, 2024, 4:51 PM IST

CM Chandrababu Naidu on YS Jagan Mohan Reddy: తాను 1995 సీఎంనే కానీ 2014 సీఎంను కాదని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, చంద్రబాబు స్పష్టం చేశారు. ఈసారి ఖచ్చితంగా రాజకీయ పరిపాలనే చేస్తానని ఆయన అన్నారు. విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ రాజకీయ ముసుగులో తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ వ్యవహారాలు పట్టించుకోవట్లేదని క్యాడర్ నుంచి వస్తున్న విమర్శలు అర్ధం చేసుకోగలనని అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళగిరిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పు భారం మోస్తున్నామనే విషయాన్ని గ్రహించాలని సీఎం పేర్కొన్నారు. మనం ఓ విషవలయంలో ఉన్నామని గుర్తించాలని, దీన్ని పరిష్కరించేందుకు కొంత సమయం అవసరమని తెలిపారు. ఇప్పటికే చాలా వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. గత ఎలక్షన్స్​ను ఎన్నికలు అనేకంటే రాక్షసుడితో యుద్దం అనాలో, మరేం అనాలో తెలియట్లేదన్నారు. నష్టపోయిన కార్యకర్తలను ఆదుకుంటూనే, ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని చంద్రబాబు స్పష్టంచేశారు.

రూ.100తో ఐదు లక్షల బీమా- ఘనంగా ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

CM CBN on Sand Mafia: ఎక్కడ ఇసుక దందా జరుగుతున్నా తిరుగుబాటు చేయండని, తాను అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మద్యం ఎంఆర్​పీ ధరపై ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించవద్దని మందుబాబులను కోరారు. మనం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలోకి చొరబడి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని వైఎస్సార్సీపీ నేతలు యత్నించారని ఆయన మండిపడ్డారు. జీఎస్టీతో కలిపి 97 రూపాయలు అయ్యే సినరేజ్ ఛార్జీకి 35 రూపాయలకే టెండర్ వేస్తామంటూ వైఎస్సార్సీపీ నేతలు వచ్చారని విమర్శించారు. ఇసుక కొరత సృష్టించి బ్లాక్‌ మార్కెటింగ్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే అతి తక్కువ ధరకు టెండర్లు వేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా, ఉచిత ఇసుక స్ఫూర్తి దెబ్బతినకూడదనే సినరేజ్ ఛార్జీలు, జీఎస్టీ కూడా ఎత్తి వేశామని చంద్రబాబు తెలిపారు.

Chandrababu on YSRCP Cases: గత ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టిన తప్పుడు కేసులకు చట్ట పద్ధతిలోనే పరిష్కారం చూపిస్తానని, ఎవ్వరూ తొందరపడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఎక్కువ అంచనాలు పెట్టేసుకుని ఎవ్వరూ నిరుత్సాహపడొద్దని ఆయన కోరారు. రాజకీయాల్లో ఎన్ని మార్పులు, సంస్కరణలు వచ్చినా, మూల సిద్దాంతం ప్రజాసేవని మరవద్దని చంద్రబాబు హితవుపలికారు.

2029లోనూ గెలుపే లక్ష్యం - టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు

Last Updated : Oct 26, 2024, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.