ETV Bharat / politics

"అధికారిక వ్యవహారాల్లో కుటుంబసభ్యుల జోక్యం వద్దు- వైఎస్సార్సీపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి" - AP CABINET MEETING

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 17, 2024, 9:57 AM IST

AP Cabinet Meeting Decisions: పాలనలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టేందుకు, అవసరమైన శిక్షణనిచ్చేందుకు గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గుడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని కూడా ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నామనే అభిప్రాయం మంగళవారం మంత్రి వర్గం ముగిశాక జరిగిన అంతర్గత సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. వివిధ శాఖల్లో గత ప్రభుత్వం చేసిన అక్రమాల్ని లోతుగా అధ్యయనం చేయాలని సూచించినట్లు సమాచారం.

AP Cabinet Meeting Decisions
AP Cabinet Meeting Decisions (ETV Bharat)

AP Cabinet Meeting Decisions : ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఆర్థిక, ఆర్థికేతర అంశాలేవో చూసుకుని ఆర్థికేతర అంశాల అమలుపై వెంటనే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక సహచర మంత్రులతో జరిగిన అంతర్గత భేటీలో వివిధ కీలక అంశాలు చర్చకువచ్చాయి. మంత్రులు తరచూ క్షేత్ర పర్యటనలకు వెళ్లాలని సూచించిన సీఎం అధికారిక వ్యవహారాల్లో కుటుంబసభ్యుల జోక్యం వద్దని హితబోధ చేశారు. ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్సీపీ అదే పనిగా బురద జల్లుతోందని, దాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని సీఎం సూచించారు.

మెగా డీఎస్సీ భర్తీకి ప్రక్రియ : ప్రభుత్వం బాగా పని చేస్తోందన్న భావన ప్రజల్లో ఉందని, దాన్ని సుస్థిర పరుచుకునేందుకు మరింతగా శ్రమించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు, వాటి వల్ల వస్తున్న ఫలితాలు, ప్రజలకు జరుగుతున్న మేలు స్పష్టంగా కనిపించాలన్నారు. మంత్రులు వారి శాఖలపై వీలైనంత త్వరగా పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల హామీలన్నీ ఒక్కొకటిగా అమలు చేస్తున్నామని, మెగా డీఎస్సీ భర్తీకి ప్రక్రియ, నైపుణ్య గణన జరుగుతోందని మంత్రి నారా లోకేశ్ అన్నట్లు సమాచారం.

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రత్యేక సాయం చేయండి- అమిత్‌షాతో చంద్రబాబు భేటీ - CHANDRABABU AMIT SHAH meeting

అక్రమాలకు బాధ్యులెవరో నిగ్గు తేల్చాలి : వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు చేసిన భూకబ్జాలు, అక్రమాలు, వారికి సహకరించిన అధికారులపై లోతైన విచారణ అవసరమని సమావేశంలో చర్చ జరిగింది. ఆయా శాఖల్లో పని చేస్తున్న అధికారులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి అక్రమాల్లో వారి ప్రమేయం కూడా ఉండటమే కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. వాటిని మరింత లోతుగా తరచిచూసి, వాస్తవాల్ని బైటపెట్టేందుకు ప్రత్యేక కమిటీలు వేయాలని, క్షేత్రస్థాయి నుంచి సమగ్ర వివరాలు తెప్పించుకొని అక్రమాలకు బాధ్యులెవరో నిగ్గు తేల్చాలని నిర్ణయించారు. ప్రభుత్వంలో ఉండి ఊహాగానాలతో మాట్లాడటం సరికాదని బాధ్యులపై అన్ని ఆధారాలతో చర్యలు తీసుకుందామని సీఎం చంద్రబాబు హితబోధ చేసినట్లు సమాచారం.

ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం - Land Titling Act Repeal

ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం : కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిన సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినట్లు సమాచారం. మంత్రులు తమ పనితీరుని స్వయంగా సమీక్షించుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ కావాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసిన అన్న క్యాంటీన్లను ఇప్పటికే ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని నిర్ణయించగా మొదటి విడతలో కనీసం వంద క్యాంటీన్లు తెరవాలని, క్రమంగా సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది.

వెయ్యి కోట్ల అప్పు : గత ప్రభుత్వం రైతులకు చెల్లించకుండా బకాయి పెట్టిన డబ్బులో వెయ్యి కోట్లు కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక అప్పు తెచ్చి మరీ చెల్లించిందని, ఆ విషయాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోయామనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం - పలు కీలక బిల్లులకు ఆమోదం - AP Cabinet Meeting Today

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.